శనివారం 30 మే 2020
Nizamabad - Feb 21, 2020 , 05:45:29

పేరు నిలబడాలె.. పట్నం బాగుపడాలె..

పేరు నిలబడాలె.. పట్నం బాగుపడాలె..

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పథకాలు ఆశామాషీ పథకాలు కావని, దేశంలోనే ఎవరూ చేయని ఆలోచనను సీఎం కేసీఆర్‌ చేశారని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌజింగ్‌, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి : పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పథకాలు ఆశామాషీ పథకాలు కావని, దేశంలోనే ఎవరూ చేయని ఆలోచనను సీఎం కేసీఆర్‌ చేశారని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌజింగ్‌, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ప్రాణాలకొడ్డి తెచ్చుకున్న తెలంగాణలో వేల కోట్లు ఖర్చు చేసి పథకాలు రూపొందించుకున్నామని, సమైక్య రాష్ట్రంలో మనకు దక్కని ఫలాలన్నీ ఒక్కొక్కటిగా అందుకుంటున్నామని, పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు కావాల్సిన ప్రజా సంక్షేమ పథకాలన్నీ రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో గురువారం పట్టణ ప్రగతి అవగాహన సదస్సు కలెక్టర్‌ నారాయణరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమానికి ఇంత పెద్దపీట వేసినా.. పల్లెలు ఎందుకు అభివృద్ధికి నోచుకోవడం లేదనే సీఎం కేసీఆర్‌ ఆత్మ సంఘర్షణ నుంచి పుట్టిందే పల్లె ప్రగతి కార్యక్రమమన్నారు. పంచాయతీరాజ్‌, మున్సిపాలిటీ కొత్త చట్టాలు దీని కోసమే రూపొందించారని, ఇక పల్లెలు, పట్టణాలు పూర్తిగా రూపు రేఖలు మార్చుకొని ప్రజలకు కనీస అవసరాలు తీరేలా.. ఆదర్శ పల్లెలు, పట్నాలుగా మారేలా ఈ చట్టాలు అమలు చేయడం ప్రస్తుతం మనందరి బాధ్యత అన్నారు. 


పల్లెప్రగతి స్ఫూర్తితో పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టామని, ఈ నెల 24 నుంచి మార్చి 4 వరకు పట్టణ ప్రగతి చేపట్టాలన్నారు. ఈ పది రోజులు.. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంగా ఓ టీమ్‌లాగా వార్డుల్లో పాదయాత్రలు చేయాలన్నారు. ఆ సమయంలోనే వార్డుల వారీగా సమస్యలను గుర్తించాలని, వాటని క్రమానుగతంగా పూర్తిగా పరిష్కరించాలని సూచించారు. ఆనాడు సమైక్య పాలనలో మనం పడ్డ గోసలన్నీ కేసీఆర్‌ ఒక్కొక్కటిగా తీర్చుతూ వచ్చారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరంతో సా గునీరందిస్తున్నారని గుర్తు చేశారు. మూడువేల మెగావాట్ల విద్యుత్తును తెలంగాణకు ఇచ్చేందుకు సమైక్య పాలకులు అరిగోస పెట్టారని, కానీ రా ష్ట్రం ఏర్పడిన తర్వాత 12 వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగలిగామన్నారు. 


పింఛన్లను రూ.200 నుంచి రూ.2 వేలకు పెంచుకున్నామని, వికలాంగులకు రూ.3 వేలు ఇస్తున్నామని తెలిపారు. పల్లె ప్రగతి రెండు విడతల్లో అద్భుత ప్రగతిని సాధించిందన్నారు. ప్రతి గ్రామానికీ ఒక ట్రాక్టర్‌ ఉండడమనేది దేశంలో ఏ పంచాయతీకీ లేదన్నారు. ఇన్నేండ్ల స్వాతంత్య్ర భారతంలో పల్లెల ప్రగతిపై ఎవ్వరూ ఆలోచించలేదని, సీఎం కేసీఆర్‌ ఆలోచనలతో ఇప్పుడు దేశం ఇటువైపు చూస్తున్నదన్నారు. గ్రామలు బాగుపడ్తున్నాయని, డంపింగ్‌యార్డులు, వైంకుంఠధామాలు, పారిశు ద్ధ్యం, కోట్లాదిగా మొక్కలు నాటే కార్యక్రమాలు పల్లెల్లో చేపట్టామన్నారు. సపాయి కార్మికులకు జీ తాలు పెంచుకున్నామని, ఖాళీలున్న చోట్ల సపా యి కార్మికులను భర్తీ చేసుకోవాలన్నారు. అవసరమైన డంపింగ్‌ యార్డులను పట్టణాల్లో ఏర్పాటు చేయాలన్నారు. రద్దీగా ఉండే సెంటర్లలో పబ్లిక్‌ టాయిలెట్స్‌ను నిర్మించాలన్నారు. రోడ్లకిరువైపులా అవసరమైన ఎవెర్యూ ప్లాంటేషన్‌కు ప్రణాళికలు చేసుకొని కావాల్సిన మొక్కలు నాటాలన్నా రు. బడ్జెట్‌లో పది శాతం నిధులు మొక్కల పెంపకానికి కేటాయిస్తున్న విషయాన్ని గుర్తు చేసిన మంత్రి.. 


ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే కలెక్టర్‌, కమిషనర్లు బాధ్యులవుతారని హెచ్చరించా రు. పట్టణ ప్రగతిలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు జ నంతో మేమకమై తమ వార్డుల్లో డివిజన్లలో ప్ర జల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలకు 14వ ఆర్థిక సం ఘం నిధులతో పాటు అదే స్థాయిలో రాష్ట్ర నిధు లు కూడా విడుదల చేస్తున్నదని, ఈ నిధులను వి నియోగించుకోవాలన్నారు. ఇదొక సువర్ణ అవకాశంగా భావించి తమను ఎ న్నుకున్న ప్రజలకు సే వ చేసుకొనే సందర్భాన్ని వినియోగించుకోవాలని కోరారు. పట్టణ ప్రగతిలో పది రోజులు పాదయా త్ర చేసి శ్మశాన వాటికలకు, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌కు స్థలాన్ని గుర్తించాలన్నారు. అక్షరాస్యులు, ని రక్షరాస్యుల జాబితాను కూడా రెడీ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత, నగర మేయర్‌ నీతూ కిరణ్‌, ఆర్మూర్‌, బో ధన్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీ చైర్మన్లు, సీపీ కార్తికేయశర్మ, అడిషనల్‌ కలెక్టర్‌ (స్థానిక సంస్థల) బీఎస్‌ లత, డీఎఫ్‌వో సునీల్‌ హిరామత్‌, నగర కార్పొరేషన్‌ కమిషనర్‌ జితేశ్‌ వీ పాటిల్‌, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు.


logo