బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Feb 20, 2020 , 02:40:14

పనులు చకచకా..

పనులు చకచకా..


ఖలీల్‌వాడి : టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయం, మినీ తెలంగాణ భవన్‌ ప్రారంభానికి రెడీ అవుతున్నది. ప్రతి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం ఉండాలని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నగరంలోని ఎల్లమ్మగుట్టలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించేందుకు అనువైన స్థలాన్ని కొనుగోలు చేశారు. జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయ పనులు మూడు నెలల క్రితం రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. రూ.60 లక్షల వ్యయంతో 3,800 గజాల స్థలంలో పార్టీ కార్యాలయంతో పాటు మీటింగ్‌ హాల్‌ నిర్మాణం చేపడుతున్నారు. ఈ పనులు 90 శాతం మేర పూర్తయ్యాయి. ఈ కార్యాలయాన్ని ఎల్లమ్మగుట్టలోని రూరల్‌ తహసీల్‌ కార్యాలయం వద్ద నిర్మిస్తున్నారు. కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడి ఛాంబర్‌, ఆఫీస్‌ రూం, హాల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 


మీటింగ్‌ హాల్‌లో సుమారు 500 మందికి పైగా కూర్చునేలా అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. విశాలమైన ప్రదేశంలో చెట్లు, గార్డెన్‌ ఏర్పాటు చేయనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నిరంతర పర్యవేక్షణలో పార్టీ కార్యాలయం పనులు చకచకా సాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయం అందుబాటులోకి రానున్నది. ఈ పనులు తుది దశకు చేరుకున్నాయి. మార్చి మొదటి వారంలో ప్రారంభానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ నిర్మాణపు బాధ్యతలు నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డికి అప్పగించారు. కొన్ని రోజుల క్రితం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యటించి భవన నిర్మాణపు పనుల్లో చేయాల్సిన మార్పులు, చేర్పుల గురించి చర్చించారు. ఈ క్రమంలో త్వరలోనే జిల్లాలో పూర్తిస్థాయిలో టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయ సొంత భవనం అందుబాటులోకి రానుంది. logo