బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Feb 20, 2020 , 02:38:46

నేటి నుంచి నిజాంసాగర్‌ నీటి విడుదల

నేటి నుంచి నిజాంసాగర్‌ నీటి విడుదల


నిజాంసాగర్‌,నమస్తే తెలంగాణ/ నిజాంసాగర్‌ రూరల్‌/ వర్ని: నిజాంసాగర్‌ ఆయకట్టు కింద సాగు  చేస్తున్న యాసంగి పంటల కోసం నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీటిని గురువారం నుంచి విడుదల చేయనున్నట్లు డీఈఈ దత్తాత్రి, ఏఈఈ శివప్రసాద్‌ బుధవారం వేర్వేరుగా తెలిపారు. నిజాంసాగర్‌ నుంచి అలీసాగర్‌ వరకు 70వేల ఎకరాల ఆయకట్టును కాపాడేందుకు 1200 క్యూసెక్కుల చొప్పున 10 రోజుల పాటు సుమారు 1.00 టీఎంసీ నుంచి 1.20 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1387.72 అడుగులతో 3.19 టీఎంసీల నీరు నిలువ ఉండగా పది రోజుల పాటు ఒక్క టీఎంసీ నీటిని విడుదల చేస్తామని తెలిపారు. ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటల అవసరాల మేరకు రెండో విడత మరోసారి విడుదల చేయనున్నామని అన్నారు.  డిసెంబర్‌లో జరిగిన డీఐబీ సమావేశం ప్రకారం మొదటి విడత పది రోజుల పాటు రెండో విడత మరో పది రోజుల పాటు మొత్తం రెండు విడతల్లో నీటిని ఆయకట్టుకు అందించనున్నట్లు తెలిపారు.


స్పీకర్‌ను కలిసిన వర్ని నాయకులు

రైతుల కోరిక మేరకు గురువారం నుంచి నిజాంసాగర్‌ నీటిని విడుదల చేయనున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి వెల్లడించినట్లు టీఆర్‌ఎస్‌ వర్ని మండల కార్యదర్శి వెలగపూడి గోపాల్‌ తెలియజేశారు. వారు బుధవారం హైదరాబాద్‌లో స్పీకర్‌ను కలిసిన మాట్లాడారు. స్పీకర్‌ను కలిసిన వారిలో నాయకులు మేక వీర్రాజు, సొసైటీ చైర్మన్లు నామాల సాయిబాబు, కృష్ణారెడ్డి, కనకారెడ్డి ఉన్నారు.logo