బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Feb 19, 2020 , 02:17:00

సీఈ యూనిట్‌గా ఉమ్మడి జిల్లా సాగు నీటి నిర్వహణ

సీఈ యూనిట్‌గా ఉమ్మడి జిల్లా సాగు నీటి నిర్వహణ

కమ్మర్‌పల్లి, నమస్తేతెలంగాణ  :  జిల్లాలో సాగు నీటి పారుదల నిర్వహణ ఇక చీఫ్‌ ఇంజినీరు కిందకు రానుంది. ఇప్పటిదాకా వివిధ స్థాయిల్లో, వివిధ రకాల నిర్వహణ ఉండేది. దీంతో నిర్వహణ, సాగు నీటి ప్రణాళికల అమలులో సమన్వయ లోపంతో జాప్యం చోటు చేసుకునేది. అన్ని రకాల సాగు నీటి నిర్వహణను చీఫ్‌ ఇంజినీరు యూనిట్‌గా చేపట్టాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించడంతో రాష్ట్రంలో నీటి పారుదల శాఖ నిర్వహణా వ్యవహారాలు 11 సీ.ఈ. యూనిట్లుగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థాయిలో సీఈ యూనిట్‌ ఏర్పడనుంది. ఉమ్మడి జిల్లాలో ఎస్సారెస్పీ, నిజాంసాగర్‌ జలాశయాలు ఉన్నాయి. ఎస్సారెస్పీపై ఆధారపడి నిర్మించిన గుత్ప, అలీసాగర్‌, చౌట్‌పల్లి హన్మంత్‌ రెడ్డి ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. లెండి, కౌలాస్‌నాలా, రామడుగు, పోచారం ప్రాజక్టులు ఉన్నాయి. సాగు అభివృద్ధి సంస్థ కింద ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటితో పాటు చెరువులు, కుంటలు ఉన్నాయి. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు కింద 20, 21, 22 ప్యాకేజీల కింద సాగు నీటి సౌకర్యం పెద్ద ఎత్తున కల్పించే పనులు జరుగుతున్నాయి. సుమారు 6.82 లక్షల ఎకరాల సాగు జరుగుతున్నది. ఇ ది వరకు ఈ భూములకు సాగు నీటి నిర్వహణ నాలుగైదు శాఖల కు సంబంధం ఉండేది. ఈ శాఖలన్నీ సమన్వయం చేసుకుంటూ పోయే క్రమంలో కొంత జాప్యం తప్పకపోయేది. ఎస్‌.ఈ. స్థాయి యూనిట్‌గా నిర్వహణ జరిగేది. సాగునీటి వ్యవస్థను పునర్వవస్థీకరిస్తుండడంతో నిజామాబాద్‌ సీ ఈ యూనిట్‌గా సాగు నీటి నిర్వహణ ఒకే గొడుగు కిందకు రానుం ది. ఈ మేరకు జీవో కూడా జారీ అయ్యింది. సీ.ఈ. యూనిట్‌గా ఒ కే గొడుగు కిందకు రావడంతో సమన్వయం పెరుగనున్నది. వివిధ కార్యాలయాల ద్వారా పరిపాలన, నిర్వహణ జరిగినా పర్యవేక్షణ మరింతగా మెరుగుపడనుంది. ఇది వరకు మాదిరిగానే ఎస్సారెస్పీ సీఈ కిందకు ఎస్సారెస్పీ నుంచి ఎల్‌ఎండీ వరకు నిర్వహణ ఉంటుంది. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం, వరద కాలువ, లక్ష్మి కాలువ దీని పరిధిలోనే ఉంటాయి. నిజామాబాద్‌ సీఈ పరిధిలో నిజాంసాగర్‌ ప్రాజెక్టు, నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టు, గుత్ప, అలీసాగర్‌, చౌట్‌పల్లి హన్మంత్‌ రెడ్డి ఎత్తిపోతల పథకాలు, లెండి, కౌలాస్‌నాలా, రామడుగు, పోచారం ప్రాజె క్టు, చిన్న తరహా ప్రాజెక్టులు, చెరువులు, కుంటల కింద సా గు నిర్వహణ మొత్తం సీఈ పర్యవేక్షణలో జరుగుతుంది.



logo