శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Feb 18, 2020 , 02:34:39

డీసీసీబీ టీఆర్‌ఎస్‌దే..

డీసీసీబీ టీఆర్‌ఎస్‌దే..

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: సహకార సంఘాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు తిరుగులేని ఆధిక్యాన్ని కనబర్చారు. జిల్లాలోని మొత్తం 89 సహకార సంఘా ల్లో 84 చైర్మన్‌ పీఠాలను టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులే దక్కించుకొన్నారు. దీంతో డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు కూడా టీఆర్‌ఎస్‌కే దక్కనున్నాయి. సొసైటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు వాయిదా పడ్డ 16 స్థానాల్లో సోమవారం అధికారులు తిరిగి ఎన్నికలు నిర్వహించారు. మెజార్టీ స్థానాల్లో గులాబీ పార్టీదే గుత్తాధిపత్యం కొనసాగ గా అందరి దృష్టి డీసీసీబీ, డీసీఎంఎస్‌ పదవులపై పడింది. ఉమ్మడి జిల్లా ప్రకారం డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాలు కొనసాగుతుండగా.. ఈ పదవులు పూర్తిగా టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడనున్నాయి. అన్నిచోట్ల ఎన్నికలు సజావుగా సాగడంతో త్వరలోనే డీసీసీబీ చైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.  జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పీఠం టీఆర్‌ఎస్‌ ఖాతాలో చేరినట్లే. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో మొత్తం 144 సహకార సంఘాలుండగా.. ఇందులో 136 సహకారం సంఘాలు టీఆర్‌ఎస్‌ గెలుచుకున్నది. మిగిలినవి ప్రతిపక్షాలు పంచుకున్నవి. నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 89 సహకారం సంఘాలుండగా.. 84 సహకార సంఘాలు టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడ్డాయి. 


సోమవారం వాయిదా పడ్డ 16 సొసైటీలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. దీంతో మొత్తం జిల్లాలోని సొసైటీల్లో 84 టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులే చైర్మన్లుగా ఎన్నికయ్యా రు. ఇద్దరు కాంగ్రెస్‌, ఇద్దరు బీజేపీ, జాన్కంపేట సొసైటీ సీపీఐ(ఎంఎల్‌)కు దక్కింది. దీంతో డీసీసీబీ పీఠంతో పాటు డీసీఎంఎస్‌ పీఠం కూడా టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడిపోయింది. ఇక ఎన్నిక లాంఛనప్రాయమే కానుంది. ఆదివారం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించగా.. 16 చోట్ల కోరం లేక ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే. వాయిదా పడిన .నిజామాబాద్‌, పాల్దా, మాక్లూ ర్‌, రామడుగు,  ఇందల్వాయి, సాలూర, పెంటకుర్దు, జాన్కంపేట్‌, రెంజల్‌, నీలా, నవీపేట్‌, బినోలా, కోటగిరి, కొత్తపల్లి, ఎత్తొండ, చందూర్‌ సొసైటీలకు మంగళవారం ఎన్నికలు నిర్వహించారు. ఇందులో జాన్కంపేట మినహా అన్ని సొసైటీల చైర్మన్‌ పీఠాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్నది. డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్ల ఎన్నిక కోసం త్వరలో నోటిఫికేషన్‌ విడుదల కానుంది.


logo