ఆదివారం 24 మే 2020
Nizamabad - Feb 17, 2020 , 02:57:29

జన్మదిన వేడుక హరిత కానుక

జన్మదిన వేడుక హరిత కానుక

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలను సోమవారం జిల్లాలో ఘనం గా నిర్వహించనున్నారు. ప్రభుత్వ శాఖ లు, టీఆర్‌ఎస్‌ పార్టీ, ప్రైవేట్‌ సంస్థల ఆ ధ్వర్యంలో సీఎం పుట్టిన రోజు వేడుకల ను నిర్వహించనున్నారు. కేసీఆర్‌కు మొ క్కలు నాటి పర్యావరణాన్ని కాపాడే కా ర్యక్రమాలంటే ఎంతో మక్కువ. దీంతో ఆయనకు ఇష్టమైన కార్యక్రమంగా సో మవారం సీఎంకు పుట్టిన రోజు కానుక గా జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. బాల్కొండ నియోజకవర్గంలో ఓ యజ్ఞంలా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులకు, అభిమానులకు ఆయన సూచించారు. ఆకుపచ్చని తెలంగాణ, పర్యావరణహిత రాష్ట్రం కోసం సీ ఎం కేసీఆర్‌ పరితపిస్తారని, ఆయన స్వ ప్నాన్ని నిజం చేసేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని మంత్రి కోరారు. 


తన సొంత నియోజకవర్గమైన బాల్కొండలో ముఖ్యమంత్రి జన్మదిన కానుకగా పార్టీ శ్రేణులు, అభిమానులు ఓ యజ్ఞం లా మొక్కలు నాటి వాటి సంరక్షణ కో సం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కలెక్టర్‌ నా రాయణరెడ్డి కోరారు. సీఎం కేసీఆర్‌ ఆశయానికి అనుగుణంగా పనిచేసి ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటనున్నారు. కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకల నిర్వహణకు ఆయా నియోజక వర్గ ఎ మ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, ఆశన్నగారి జీవన్‌ రెడ్డి, బిగాల గణేశ్‌గుప్తా, షకీల్‌ ఆమేర్‌ ఏర్పాట్లు చేశారు. మాక్లూర్‌లో జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగనున్నాయి. కేసీఆర్‌ అభిమానులు మొక్కలు నాటి కానుకగా ఇవ్వనున్నారు. ‘నమస్తే తెలంగాణ’ యంత్రాంగం ఆధ్వర్యంలో డిచ్‌పల్లిలోని యూనిట్‌ కార్యాలయంలో, మోడల్‌ స్కూల్‌లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. 


మాక్లూర్‌లో..

మాక్లూర్‌: మండల కార్యాలయాల సముదాయ ఆవరణలో సోమవారం మధ్యాహ్నం రూపా నివాస్‌(ఫౌండేషన్‌) కో-ఫౌండర్‌ దాదన్నగారి సందీప్‌రావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సక్రియానాయక్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్యక్రమానికి జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, కలెక్టర్‌ నారాయణరెడ్డి హాజరవుతున్నారని అన్నారు. కార్యక్రమానికి మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలు తప్పని సరిగా హాజరు కావాలన్నారు.


logo