శనివారం 06 జూన్ 2020
Nizamabad - Feb 17, 2020 , 02:55:27

69 చైర్మన్‌ పీఠాలు టీఆర్‌ఎస్‌ ఖాతాలో..

69 చైర్మన్‌ పీఠాలు టీఆర్‌ఎస్‌ ఖాతాలో..

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సత్తా చాటింది. చైర్మన్‌ పీఠాలన్నీ టీఆర్‌ఎస్‌ ఖాతాల్లోనే పడ్డాయి. జిల్లాలోని మొత్తం 89 సొసైటీలకు సంబంధించిన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికను ఆదివారం నిర్వహించారు. ఇందులో కోరం లేక 16 సొసైటీల చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికను నేటికి వాయిదా వేశారు. సోమవారం వీటికి మళ్లీ ఎన్నిక నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. ఇవి పోనూ.. మిగిలిన 73 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో 69 సొసైటీల చైర్మన్‌ పీఠాలు టీఆర్‌ఎస్‌కే దక్కాయి. కాంగ్రెస్‌ (హున్సా, మునిపల్లి), బీజేపీ (మోస్రా, మాధవనగర్‌) సొసైటీలు దక్కించుకున్నాయి. 63 చైర్మన్‌ పీఠాలకు ఎన్నికలు నిర్వహించే అవసరం లేకుండానే ఏకగ్రీవమయ్యాయి. ఒకే నామినేషన్‌ రావడంతో ఈ 63 సొసైటీ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రిసైడింగ్‌ అధికారులు ప్రకటించారు. ఏకగ్రీవమైన సొసైటీ చైర్మన్లలో 59 టీఆర్‌ఎస్‌కు చెందిన అభ్యర్థులుండగా.. మిగిలిన నలుగురు కాంగ్రెస్‌, బీజేపీకి చెందినవారున్నారు. పది సొసైటీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. ఈ చైర్మన్‌ పీఠాలన్నీ టీఆర్‌ఎస్‌ వశమయ్యాయి. 58 వైస్‌ చైర్మన్‌ స్థానాలు కూడా ఏకగ్రీవం కాగా.. 14 చోట్ల ఎన్నికలు నిర్వహించారు. రెంజల్‌ మండలం దూపల్లి వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కూడా వాయిదా పడింది. కాగా.. బాల్కొండ నియోజకవర్గం మొత్తం క్లీన్‌ స్వీప్‌ చేసింది.  మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇలాఖాలో అన్ని చైర్మన్‌ స్థానాలు టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడడంతో పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. 18న డీసీసీబీ చైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ వెలువడనున్నది. 


బాల్కొండ క్లీన్‌ స్వీప్‌..  

బాల్కొండ నియోజకవర్గంలో 20 సొసైటీలుండగా.. టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. వీటిలో పది సొసైటీలు నామినేషన్ల ఉప సంహరణ రోజే ఏకగ్రీవం అయ్యాయి. కోనాసముందర్‌, కోనాపూర్‌, ఏర్గట్ల, బుస్సాపూర్‌, సావెల్‌, ముచ్కూర్‌, వేల్పూర్‌, పడగల్‌, రామన్నపేట్‌, మోర్తాడ్‌ సొసైటీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన భీమ్‌గల్‌, కమ్మర్‌పల్లి, చౌట్‌పల్లి, షెట్‌పల్లి, మోతె, పచ్చలనడుకుడ, బాల్కొండ, రెంజర్ల, వేంపల్లి, తాళ్లరాంపూర్‌ సొసైటీల్లో పలు డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 20కి 20 సొసైటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఇరవై సొసైటీలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్లుగా టీఆర్‌ఎస్‌ వారే ఎన్నికయ్యారు. 20 సొసైటీల్లో 10 సొసైటీలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మోర్తాడ్‌ మండలం షెట్పల్లి సొసైటీ చైర్మన్‌ పదవికి రెండు నామినేషన్లు రావడంతో ఎన్నిక జరిగింది.


63 ఏకగ్రీవ చైర్మన్ల స్థానాలు ఇవే.. 

బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండలంలోని బాల్కొండ, మెండోరా మండలంలోని సావెల్‌, బుస్సాపూర్‌, ముప్కాల్‌ మండలంలోని వేంపల్లి, రెంజర్ల, కమ్మర్‌పల్లి మండలంలోని కమ్మర్‌పల్లి, చౌట్‌పల్లి, కోనాపూర్‌, కోనాసముందర్‌, వేల్పూర్‌ మండలంలోని వేల్పూర్‌, మోతే, పడ్గల్‌, పచ్చలనడ్కుడ, రామన్నపేట్‌, మోర్తాడ్‌, ఏర్గట్ల మండలంలోని ఏర్గట్ల, తాళ్లరాంపూర్‌, భీమ్‌గల్‌, ముచ్కూర్‌ సొసైటీ చైర్మన్లు ఏకగ్రీవమయ్యాయి. బోధన్‌ నియోజకవర్గంలోని బోధన్‌ మండలంలోని బోధన్‌, హున్సాజాడి జమాల్‌పూర్‌, కల్దుర్కి, మినార్‌పల్లి, సాలంపాడ్‌, సంగం, రెంజల్‌ మండలంలోని దూపల్లి, నవీపేట్‌ మండలంలోని నాగేపూర్‌, ఎడపల్లి మండలంలోని ఎడపల్లి, జైతాపూర్‌, బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలంలోని పోతంగల్‌, వర్ని మండలంలోని వర్ని, జాకోరా, మోస్రా మండలంలోని మోస్రా, గోవూర్‌, రుద్రూర్‌ మండలంలోని రుద్రూర్‌, రాయికూర్‌ సొసైటీల చైర్మన్లు ఏకగ్రీవమయ్యాయి. 


నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని ముత్తకుంట, మాధవ్‌నగర్‌, మోపాల్‌ మండలంలోని మోపాల్‌, బోర్గాం, డిచ్‌పల్లి మండలంలోని డిచ్‌పల్లి, రాంపూర్‌, మెంట్రాజ్‌పల్లి, ధర్పల్లి మండంలోని ధర్పల్లి, హొన్నాజిపేట్‌, ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి, సిరికొండ, జక్రాన్‌పల్లి మండలంలోని అర్గుల్‌, మునిపల్లి, బ్రాహ్మణ్‌పల్లి, కొలిప్యాక్‌ సొసైటీ చైర్మన్లు ఏకగ్రీవమయ్యాయి. ఆర్మూర్‌ నియోజకవర్గంలోని మాక్లూర్‌ మండలంలోని అమ్రాద్‌, ఆర్మూర్‌ మండలంలోని ఆర్మూర్‌, అంకాపూర్‌, ఆలూర్‌, పిప్రి, పెర్కిట్‌, ఫతేపూర్‌, గోవింద్‌పేట్‌, నందిపేట్‌ మండంలోని అల్లాపూర్‌, డొంకేశ్వర్‌ సొసైటీ చైర్మన్లు ఏకగ్రీవమయ్యాయి. 


10 సొసైటీలకు ఎన్నికలు.. 

నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం పరిధిలోని గుండారం, బాడ్సి, బర్దిపూర్‌, తూంపల్లి, ఆర్మూర్‌ నియోజకవర్గంలోని నందపేట, బాల్కొండ నియోజకవ్గంలోని శెట్‌పల్లి, బోధన్‌ నియోజకర్గంలోని అమ్దాపూర్‌, పెంటకలాన్‌, బాన్సువాడ నియోజకవర్గంలోని చింతకుంట సొసైటీలకు ఎన్నికలు జరిగాయి. 


నేటికి వాయిదా పడ్డ సొసైటీలు ఇవే.. 

కోరం లేక 16 సొసైటీల చైర్మన్‌, వైస్‌ చైర్మన ఎన్నికలను నేటికి వాయిదా వేశారు. నిజామాబాద్‌, పాల్దా, మాక్లూర్‌, రామడుగు, ఇందల్వాయి, సాలూర, పెంటకుర్దు, జాన్కంపేట్‌, రెంజల్‌, నీలా, నవీపేట్‌, బినోలా, కోటగిరి, కొత్తపల్లి, ఎత్తొండ, చందూర్‌ సొసైటీలకు నేడు చైర్మన్లు, వైస్‌ చైర్మన్లను బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నుకోనున్నారు.  


logo