ఆదివారం 31 మే 2020
Nizamabad - Feb 17, 2020 , 02:50:39

ఘనంగా బోనాల పండుగ

ఘనంగా బోనాల పండుగ

ఇందూరు/ రెంజల్‌ : నిజామాబాద్‌ నగరంలోని ఎల్లమ్మగుట్ట ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ ఆలయ పంచమ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆడపడుచులు బోనాలను అందంగా అలంకరించి ముదిరాజ్‌ సంఘ భవనం నుంచి ఎల్లమ్మ ఆలయం వరకు డప్పు వాయిద్యాల మధ్య ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు గుర్రాల సుదర్శనం, కార్యదర్శి కిరణ్‌,  కోశాధికారి పెంచాల శ్రీనివాస్‌, బాలయ్య, రాధాకిషన్‌,  శంకర్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. కందకుర్తి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం  మహాలక్ష్మి ఆలయ ఆవరణలో నూతనంగా ప్రతిష్టించిన నల్ల పోచమ్మ, పోతరాజు విగ్రహాలను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, బోనాల ఊరేగింపు చేపట్టారు. భక్తులు ఆలయాల్లో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు నాగేశ్‌, దేవీదాస్‌, సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo