గురువారం 28 మే 2020
Nizamabad - Feb 16, 2020 , 02:27:33

సహకారంలో టీఆర్‌ఎస్‌దే హవా

సహకారంలో టీఆర్‌ఎస్‌దే హవా

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ/ భీమ్‌గల్‌/ మోర్తాడ్‌/ వేల్పూర్‌/ ముప్కాల్‌/ ఏర్గట్ల: స హకార సంఘం ఎన్నికల్లో నియోజక వర్గంలోని అన్ని చోట్ల టీఆర్‌ఎస్‌ బలపర్చిన అ భ్యర్థులే అధిక సంఖ్యలో విజేతలుగా నిలిచారు. కమ్మర్‌పల్లి పీఏసీఎస్‌ పరిధిలోని ఏ డు టీసీలకు, చౌట్‌పల్లిలో మూడు టీసీలకు శనివారం ఎన్నికలు నిర్వహించారు. కమ్మర్‌పల్లి పరిధిలో ఏడు టీసీలకు ఆరు  గురు, చౌట్‌పల్లి పరిధిలో మూడింటికి మూడింటిలో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులే గెలిచారు. మండలంలో నాలుగు సొసైటీలు ఉండగా కోనాసముందర్‌, కోనాపూర్‌ సొసైటీలు ఇది వరకే ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరిగిన కమ్మర్‌పల్లి, చౌట్‌పల్లి సొసైటీ ల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఘన విజయంతో మొత్తం నాలుగు సొసైటీలు టీఆర్‌ఎస్‌ ఖా తాలో చేరాయి. కమ్మర్‌పల్లి సొసైటీ పరిధి లో టీసీ 1లో కొత్తపల్లి అశోక్‌, 3లో తీగల హరీశ్‌, 4లో బద్దం రాజ శేఖర్‌, 5లో రెం జర్ల మహేందర్‌, 8లో కొమ్ముల రవీందర్‌, 12లో రేణి దశకుమార్‌, 13లో గుగులోత్‌ లక్ష్మి, చౌట్‌పల్లి సొసైటీలో 11లో పార్వతినారాయణ, 12లో నెల్ల బుచ్చన్న, 13లో బాషెట్టి గంగాధర్‌ గెలుపొందారు. కమ్మర్‌పల్లి సొసైటీ పరిధిలో 87 శాతం, చౌట్‌పల్లి లో 80 శాతం పోలింగ్‌ నమోదైంది. 


భీమ్‌గల్‌ సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చి న అభ్యర్థులు ఘన విజయం సాధించారు.  మండల పరిధిలో  భీమ్‌గల్‌, ముచ్కుర్‌ రెండు సొసైటీలు ఉన్నాయి. ముచ్కుర్‌ సొసైటీలో 13 డైరెక్టర్లకు గాను 13 ఏకగ్రీవమయ్యాయి. భీమ్‌గల్‌ సొసైటీలో 13 డైరెక్టర్లకు 9 ఏకగ్రీవం కావడంతో, మిగిలిన నా లుగు పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. టీసీ 3లో దుబ్బాక దశాగౌడ్‌, 4లో నూకల లింబాద్రి, 8లో బుర్ర దేవేందర్‌, 9లో ఎస్‌. గంగాధర్‌ ఎన్నికయ్యారు. సహకార ఎన్నికల్లో భాగంగా భీ మ్‌గల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మల్లెల రాజశ్రీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సరళిని జడ్పీ సీఈవో గో వింద్‌ పరిశీలించారు. ఎస్సై శ్రీధర్‌ రెడ్డి ఆ ధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మోర్తాడ్‌  మండల పరిధిలోని 8 సహకార సంఘాలు ఇది వరకే ఏకగ్రీవమయ్యాయి. శెట్‌పల్లి సహకార సంఘంలో ఐదు, ఆరు టీసీలకు నిర్వహించిన ఎన్నిక లు ప్రశాంతంగా జరిగాయి. ఐదో టీసీలో పోతుగంటి భూమేశ్వర్‌, ఆరో టీసీలో తీగెల సాయరెడ్డి గెలుపొందారు. భీమ్‌గల్‌ సీఐ సైదయ్య, మండల ప్రత్యేకాధికారి నర్సింగ్‌దాస్‌, తహసీల్దార్‌ శ్రీధర్‌, ఎస్సై సంపత్‌కుమార్‌, ఎన్నికల అధికారి సురేశ్‌ పర్యవేక్షణ లో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. 


వేల్పూ ర్‌ మండలంలోని మోతె, పచ్చలనడ్కుడలో సహకార సంఘం ఎన్నికలు నిర్వహించా రు. మోతెలో 13 డైరెక్టర్లకు గాను 11 ఏకగ్రీవం కాగా 2 టీసీలకు ఎన్నికలు జరిగా యి. పచ్చలనడ్కుడ సొసైటీ  పరిధిలో 13 డైరెక్టర్లకు 10 ఏకగ్రీవం కాగా మిగిలిన మూ డు టీసీలకు ఎన్నికలు నిర్వహించారు. మో తెలో నర్సారెడ్డి, దామ సాయన్న, పచ్చలనడ్కుడలో ఆశల గంగాధర్‌, రాములు, మ హిపాల్‌ గెలుపొందారు. బాల్కొండ సొసైటీ పరిధిలోని టీసీ 1లో వేంపల్లి పెద్దబాల్‌ రాజేశ్వర్‌, 3లో మిద్దెల ప్రసాద్‌ గౌడ్‌, వన్నెల్‌(బి) పరిధిలోని టీసీ 8లో తూర్పు రమేశ్‌ గౌడ్‌, 9 లో నాగులపల్లి సూరజ్‌ గౌడ్‌ గెలుపొందారు. ముప్కాల్‌ మండలం వేంపల్లి పరిధిలోని టీఎస్‌ 5లో చందా జైడి రవి, 6లో బద్దం సాగర్‌, 7లో మాలావత్‌ నం దా, 13లో మాదిగ తైల నడ్పి రత్న, రెంజర్లలో 10లో సామ రాజేందర్‌ గెలుపొందా రు. అనంతరం టీఆర్‌ఎస్‌ నాయకులు, కా ర్యకర్తలు సంబురాలు నిర్వహించారు. ఏర్గ ట్ల మండలంలోని గుమ్మిర్యా ల్‌లో 13 టీసీ లకు 11 ఏకగ్రీవం కాగా 5, 7వ టీసీలకు ఎన్నికలు నిర్వహించారు.  ఇందులోనూ టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు విజేతలుగా నిలిచారు.


logo