శనివారం 29 ఫిబ్రవరి 2020
‘సహకార’ పోరుకు సర్వం సిద్ధం

‘సహకార’ పోరుకు సర్వం సిద్ధం

Feb 15, 2020 , 01:19:42
PRINT
‘సహకార’ పోరుకు సర్వం సిద్ధం

నిజామాబాద్‌ సిటీ/ ఇందూరు విలేకరులు: సహకార ఎన్నికల పోరుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్‌ జరుగనుంది. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఎన్నికలకు సంబంధించి సందేహాలున్న వారికి ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌ను అందుబాటులో ఉంచారు. జిల్లాలో 89 సొసైటీ ల్లో 26 పూర్తిగా ఏకగ్రీవం కావడంతో మిగితా 63 సొసైటీల పరిధిలో ఏకగ్రీవం కాగా మిగిలిపోయిన 411 డైరెక్టర్‌ స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బ్యాలెట్‌ పత్రాల ద్వారా ఎన్నిక ఉం టుంది. మధ్యాహ్నం తర్వాత ఓట్ల లెక్కింపు.. ఆ వెంటనే ఫలితాల వెల్లడి ఉంటుంది. నిజామా బాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్లలో ఇప్పటికే  ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలకు పోలింగ్‌ ఎన్నికల అధికారులు సిబ్బంది ప్రత్యేక వాహనా ల్లో చేరుకున్నారు. నేడు జరుగునున్న సహకార ఎన్నికల ప్రశాంతంగా జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.


డివిజన్ల వారీగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు

జిల్లాలో జరుగనున్న సహకార ఎన్నికలకు డివిజన్ల వారీగా అధికారులు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అవసరమైన బ్యాలెట్‌ బాక్సు లు, ఓటింగ్‌ స్లిప్పులు, గుర్తులతో కూడిన పత్రాల ముద్రణ పూర్తయింది. నిజా మాబాద్‌ డివిజన్‌కు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలి టెక్నిక్‌ కళాశాలలో, ఆర్మూర్‌ డివిజన్‌లో స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డు, బోధన్‌ డివిజన్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలింగ్‌ సామగ్రిని కేంద్రాలకు తరలించారు. 63 సొసైటీల పరిధిలోని  411 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 89 సొసైటీలకుగాను 1147 డైరెక్టర్‌ స్థానాలున్నాయి. ఇందులో 736 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటి కోసం 966 మంది బరిలో ఉన్నారు. పార్టీ రహితంగా జరిగే ఎన్నిక కావడంతో గుర్తులు కేటాయించారు.  పోలింగ్‌ కేంద్రా ల వద్ద ఓటర్ల కోసం ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌ను అధికారులు అందుబాటులో ఉంచారు. 


పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు

సహకార ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పా టు చేసింది. కొన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఒక పీవో, ఒక పోలింగ్‌ అధికారి ఉంటారు. వంద ఓట్ల కంటే ఎక్కువ ఉన్న చోట అదనంగా ఏపీవో, ఒక పోలింగ్‌ సిబ్బందిని వినియోగించనున్నారు. సుమారు వెయ్యి మంది సిబ్బందితో ఎన్నికలు జరుగనున్నాయి. 


16న చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక..

నేడు పోలింగ్‌ ముగియగానే ఫలితాలు ప్రకటిం చనున్నారు. 16న సొసైటీల చైర్మన్‌ , వైస్‌చైర్మన్‌ ఎన్నిక నిర్వహిస్తారు. ఆ తర్వాత  గెలిచిన చైర్మన్లు క్యాంపులోకి వెళ్లే అవకాశం ఉంది. డీసీసీబీ, డీసీ ఎంఎస్‌ చైర్మన్ల ఎన్నిక కోసం త్వరలో ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఈ ఎన్నికల్లో  సొసైటీ చైర్మన్లు ఓటింగ్‌లో పాల్గొంటారు. జిల్లా సహకార ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని జిల్లా సహకార శాఖ అధికారి సింహాచలం అన్నారు.   పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు మొత్తం కలిసి 11 00  మంది వరకు సిబ్బంది ఈ ఎన్నికల్లో పా ల్గొంటున్నారని తెలిపారు.  సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామని, వీటి పరిధిలో భారీ పోలీస్‌ బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు.


బోధన్‌ డివిజన్‌లో 19 సొసైటీల్లో  130 టీసీలకు నేడు పోలింగ్‌ 

బోధన్‌, నమస్తే తెలంగాణ : బోధన్‌ డివిజన్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నిక ల ప్రక్రియలో భాగంగా శనివారం జరిగే  పోలింగ్‌ కు సర్వం సిద్ధమైంది. డివిజన్‌లోని ఎనిమిది మం డలాల్లో సహకార ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికార యంత్రాంగం పూర్తిచేసింది. బోధన్‌ డివిజన్‌లోని 8 మండలాల్లో మొత్తం 30 సహకార సంఘాలు ఉండగా, ఇందులో 11 సహకార సంఘాలకు ఏక గ్రీవంగా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మిగతా 19 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని 130 టీసీలకు శనివారం పోలింగ్‌ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యా హ్నం 1 గంట వరకు ఆయా సొసైటీల కేంద్రా ల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల అధికారులు ఆయా పోలింగ్‌ కేంద్రాల్లోనే ఓట్ల లెక్కింపు జరు పుతారు. సహకార ఎన్నికల పోలింగ్‌ కోసం బోధ న్‌ డివిజన్‌లో 8 రూట్లను ఏర్పాటుచేసి ఎనిమిది మంది జోనల్‌ అధికారులను నియమించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఒక పోలింగ్‌ అధికారిని నియమించారు. వీరికి తోడు పోలింగ్‌ కేంద్రంలో సహాయకులుగా రెవె న్యూ సిబ్బంది ఉంటారు. ప్రతి పోలింగ్‌ కేంద్రా నికి పోలీస్‌ రక్షణ ఉంటుంది. డివిజన్‌లోని మొత్తం 130 పోలింగ్‌ కేంద్రాల్లో 117 పోలింగ్‌ కేంద్రాలకు పోలింగ్‌ సిబ్బంది రిపోర్టింగ్‌, పోలింగ్‌ సామగ్రి డిస్ట్రిబ్యూషన్‌ కోసం బోధన్‌ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్‌ సిబ్బందికి బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పెట్టెలు, పోలింగ్‌ సామగ్రిని అప్పగించారు. ఈ పోలింగ్‌ సామగ్రిని పోలింగ్‌ అధికారులు, సిబ్బం ది సరిచూసుకొని తమకు కేటాయించిన వాహనా ల్లో ఆయా పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లారు. కాగా, ఎడపల్లి మండలం జాన్కంపేట్‌, రెంజల్‌ మండలం దూపల్లి సహకార సంఘాలకు చెందిన 13 టీసీల పోలింగ్‌కు నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం నుంచి పోలింగ్‌ సిబ్బంది తరలివెళ్లారు. బోధన్‌లోని డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలో ఏర్పాట్లను బోధన్‌ ఆర్డీవో గోపీరాం, డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం ఇన్‌చార్జి శివకుమార్‌, ఆయా మండలాల తహసీల్దార్లు పర్యవేక్షించారు. బోధన్‌ డివిజన్‌లోని మొత్తం 19 ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘాల్లోని 130 టీసీలకు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆర్డీవో గోపీరాం పేర్కొన్నారు. 


పోలింగ్‌ జరిగే సహకార సంఘాలు ఇవే..

బోధన్‌ మండలంలోని బోధన్‌, సాలూర, సాలంపాడ్‌, కల్దుర్కి, పెంటాకలాన్‌, హూన్సా, మీనార్‌పల్లి, అమ్దాపూర్‌, ఎడపల్లి మండలంలోని జైతాపూర్‌, ఎడపల్లి, రెంజల్‌ మండలంలోని రెంజల్‌, దూపల్లి, నీలా, కోటగిరి మండలంలోని కోటగిరి, ఎత్తొండ, చందూర్‌ మండలంలోని చందూర్‌, మోస్రా మండలంలోని మోస్రా, చింతకుంట సొసైటీల్లో శనివారం పోలింగ్‌ జరగనుంది. ఇందులో బోధన్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఒకే ఒక టీసీ స్థానానికి ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ టీసీలో మొత్తం 139 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, రెంజల్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అత్యధికంగా 2,208 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 


logo