బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Feb 15, 2020 , 01:16:25

కేసీఆర్‌కు జై..

కేసీఆర్‌కు జై..

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: రైతు బాంధవుడు కేసీఆర్‌ వెంటే ఉన్నారు ఇందూరు రైతన్న లు. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు అత్యధికంగా ఏకగ్రీవం కావడం.. సీఎం కేసీఆర్‌పై రైతులు పెట్టుకున్న అపారనమ్మకానికి ప్రతీకగా నిలుస్తున్నది. రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు ఆలోచించే కేసీఆర్‌పై ఇందూరు రైతన్నకు ఆది నుంచి ఎనలేని అభిమానం, ప్రేమ. రైతుబం ధు, రైతుబీమా, రైతులకు ఉచితంగా 24 గంటల కరెం టు, సమయానికి ఎరువులు, విత్తనాల సరఫరా.. ఇలా రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు రైతు సంక్షేమం కోసం అహర్నిశలు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకొనే సం దర్భం వచ్చింది. సహకార ఎన్నికలంటే మొత్తానికి మొత్తం రైతులే ఓటర్లు. దీంతో రైతులంతా టీఆర్‌ఎస్‌వైపే ఉన్నారు. కేసీఆర్‌కు జై కొడుతున్నారు. ఇవి పార్టీ రహిత ఎన్నికలే అయినా.. టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులే ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. పెద్దఎత్తున డైరెక్టర్‌ స్థానాలను పోటీ లేకుండా దక్కించుకున్నారు. చైర్మన్‌ పీఠాలు కైవసం చేసుకున్నారు. బాల్కొండ, బాన్సువాడ నియోజకవర్గాల్లో పెద్దఎత్తున ఏకగ్రీవాలు జరిగాయి. ఆర్మూర్‌, బోధన్‌, రూరల్‌ నియోజకవర్గాల్లో కూడా ఏకగ్రీవ సొసైటీలు ఏర్పడ్డాయి. దీంతో రైతులంతా టీఆర్‌ఎస్‌కు జై కొడుతున్నారే విషయం మరోమారు స్పష్టమైం ది. సహకార ఎన్నికల వేదికగా ఇందూరు రైతన్న కేసీఆర్‌ రుణం తీర్చుకుంటున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో 89 సొసైటీలుండగా.. కామారెడ్డి జిల్లాలో 55 ఉన్నాయి. మొత్తం 144 సొసైటీల పరిధిలో రా్రష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఎక్కువ చైర్మన్ల పీఠాలు ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నది కూడా ఇక్కడ్నుంచే కావడం గమనార్హం. బాల్కొండ నియోజకవర్గంలో 20 సొసైటీలకు గాను 10 సొసైటీలు మొత్తానికి మొత్తం డైరెక్టర్‌ స్థానా లు దక్కించుకొని చైర్మ న్‌ పీఠాలు కైవసం చేసుకోగా.. మరో 9 సొసైటీ ల్లో ఏడుకు మించి ఒక్కో సొసైటీల్లో డైరెక్ట ర్‌ స్థానాలకు ఏకగ్రీవమయ్యాయి. వీటి పరిధిలో చైర్మన్‌ పీఠాలు  సైతం టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడ్డాయి. 

బాన్సువాడ నియోజకవర్గంలో నిజామాబాద్‌ జిల్లా పరిధిలోకి 13 సొసైటీలు రాగా.. ఇందులో 8 సొసైటీలు మొత్తం ఏకగ్రీవమయ్యాయి. ఈ చైర్మన్లు టీఆర్‌ఎస్‌ వశమయ్యాయి. కామారెడ్డి జిల్లా పరిధిలోకి బాన్సువాడ నియోజకవర్గం నుంచి 12 సొసైటీలు వస్తాయి. ఇందులో 10 సొసైటీ లు మొత్తం టీఆర్‌ఎస్‌కే దక్కాయి. ఇందూరులో 1147 డైరెక్టర్‌ స్థానాలకు 736 డైరెక్టర్‌ స్థానాలు టీఆర్‌ఎస్‌ వశమయ్యాయి. రా్రష్ట్రంలోనే ఇన్ని డైరెక్టర్‌ స్థానాలు, చైర్మన్‌ పీఠాలు దక్కించుకున్నది ఎక్కడా లేదు. ఉమ్మడి జిల్లా ఈ విషయంలో నంబర్‌వన్‌ స్థానంలో ఉంది. ఇందూరు రైతులు టీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారని, రైతు పక్షపాతిగా ఉన్న సీఎం కేసీఆర్‌ వెన్నంటే ఉండి.. సహకార ఎన్నికల్లో ఏకగ్రీవాల ద్వారా తమ ఆమోదాన్ని, అభిమానాన్ని చాటుకుంటున్నారని, ఈ విధంగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వ రుణం తీర్చుకుంటున్నారనే అభిప్రాయం సర్వత్రా రైతుల్లో వ్యక్తమవుతున్నది. 


logo