సోమవారం 01 జూన్ 2020
Nizamabad - Feb 15, 2020 , 01:12:51

కన్నుల పండువగా చక్రస్నానం

కన్నుల పండువగా చక్రస్నానం

బోధన్‌, నమస్తే తెలంగాణ/మాక్లూర్‌/మోర్తాడ్‌ : బోధన్‌ మున్సిపాలిటీలో విలీనమైన శ్రీనివాస్‌నగర్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి చక్రస్నానం కన్నుల పండువుగా జరిగింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య వేంకటేశ్వరస్వామిని ఆలయం నుంచి పక్కనే ఉన్న కొలనుకు తీసుకెళ్లారు. అక్కడ కొలనులో స్వామివారికి చక్రస్నానం చేయించారు. స్వామివారు స్నానం చేసిన నీటితో భక్తులు కూడా స్నానాలు చేసి పులకించారు. చక్రస్నానం కార్యక్రమంలో శ్రీనివాసరాజు, జయలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. మాక్లూర్‌ మండలంలోని అడవిమామిడిపల్లిగ్రామ శివార్‌లోని శ్రీఅపురూప వేంకటేశ్వరస్వామి అష్టమ బ్రహ్మోత్సవాల్లో భాగంగ నాలుగో రోజు శుక్రవారం శ్రీవేంకటేశ్వరస్వామి చక్రతీర్థం, చక్రస్నానం కార్యాక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు వందలాదిగా తరలి వచ్చి కనులారా వీక్షించారు. ప్రధాన అర్చకుడు చైతన్య సమక్షంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య వైభవంగా ఉత్సవాలను చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షురాలు అమృతలతారెడ్డి, సర్పంచులు చింతమాల్లారెడ్డి, గంట చిన్నయ్య, ఆలయ కమి టీ సభ్యులు రాజారెడ్డి, ప్రభాదేవి, లలితానరహరి, సుజాత, వసంత, ఇన్‌చార్జిలు శ్రీనివాస్‌రెడ్డి, రమణారెడ్డి, నరేశ్‌రెడ్డి, పండితులు వెంకటకృష్ణ, వెంకట కృష్ణకుమార్‌, త్రిపాఠీ, శుక్లా పా ల్గొన్నారు.  భక్తులకు ఇబ్బందు లు కలుగకుండా స్కాట్స్‌అండ్‌ గ్వైడ్స్‌ విద్యార్థులు ఏర్పాట్ల వద్ద విధులు నిర్వహించారు. మోర్తాడ్‌ మండలం దోన్‌పాల్‌ గ్రామంలో శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహోత్సవాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం మహాగణపతి పూజ, రక్షాబంధనం, అఖండదీపారాధన, యాగశాల ప్రవేశం, అంకురార్పణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. సర్పంచ్‌ పర్సదేవన్న, గ్రామకమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈకార్యక్రమాలు జరిగాయి. 


logo