బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Feb 15, 2020 , 01:11:28

హాస్టళ్ల తనిఖీ

హాస్టళ్ల తనిఖీ

కోటగిరి/ఎడపల్లి : కలెక్టర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ బీసీ, ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహాలను మైనార్టీ వెల్ఫేర్‌ జిల్లా అధికారి, మండల ప్రత్యేకాధికారి రతన్‌, తహసీల్దార్‌ విఠల్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల కేంద్రంలోని బీసీ వసతి గృహంలో రికార్డులను పరిశీలించారు. ఎంత మంది విద్యార్థులు ఉన్నారని వారి హాజరు రిజిష్టర్‌ను పరిశీలించారు. అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయా అని, భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని వార్డున్‌ నర్సింహులును ఆదేశించారు. విద్యార్థులకు నెలకోసారి ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు. వంట చేసే సమయంలో పాత్రలు శుభ్రంగా కడిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వసతి గృహంలో విద్యార్థులతో కలిసి అధికారులు భోజనం చేశారు. రుచికరంగా ఉందని వార్డెన్‌ నర్సింహులును మండల ప్రత్యేకాధికారి రతన్‌ అభినందించారు.  అనంతరం  కళాశాల బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఇన్‌చార్జి తహసీల్దార్‌ విఠల్‌, ఇన్‌చార్జి ఎంపీడీవో మారుతి ఉన్నారు.

హాస్టల్‌ పరిసరాల

పరిశీలన

ఎడపల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని తహసీల్దార్‌ ప్రవీణ్‌కుమార్‌ శుక్రవారం తనిఖీ చేశారు. హాస్టల్‌ పరిసరాలను, హాస్టల్‌ స్థితిగతులను పరిశీలించారు. హాస్టల్‌లో విద్యార్థులకు సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్దులకు వడ్డించే భోజనాన్ని రుచి చూశారు. స్నానాల గదులకు తలుపులు విరిగిపోయి ఉండడంతో వాటికి తలుపులు బిగించాలని హాస్టల్‌ వార్డెన్‌ శ్రీకాంత్‌ను ఆయన ఆదేశించారు.విద్యార్థులకు నాణ్య మైన భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ గంగాచరణ్‌, వీఆర్‌వో పూల్‌సింగ్‌ పాల్గొన్నారు. logo