శనివారం 30 మే 2020
Nizamabad - Feb 15, 2020 , 00:52:48

డయల్‌100కు 4645 ఫిర్యాదులు:సీపీ

డయల్‌100కు 4645 ఫిర్యాదులు:సీపీ

ఖలీల్‌వాడి:  జిల్లా వ్యాప్తంగా డయల్‌ 100కు 4645 ఫిర్యాదులు వచ్చాయని పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ బుధవారం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశానుసారం ప్రజలందరూ డయల్‌ 100 సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పట్టణల్లో, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు చేసే ఫోన్‌ కాల్స్‌ రిసీవ్‌ చేసుకొని సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సీపీ కార్యక్రమంలో 10-01-2020 నుంచి 12-02-2020 వరకు నిజామాబాద్‌ కమిషనరేట్‌లోని నిజామాబాద్‌, అర్మూర్‌, బోధన్‌, పోలీస్‌ స్టేషన్ల పరిధిలో మొత్తం కాల్స్‌ 4645 ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని తెలిపారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు 1) బదిలీ అఫెన్సెస్‌ కింద 86 కేసులు, 2) ప్రమాదాల కింద 603 కేసులు, సూసైడ్‌ అట్పాంప్ట్‌ కింద్ర 214 కేసులు, 4) ఇతర కేసులు 3545, 5) ఫాల్స్‌ కాల్స్‌ కింద్ర 101 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి సిబ్బంది పోన్‌ కాల్‌ వచ్చిన వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవడం జనుగుతుందని తెలిపారు. అతి తక్కువ సమయంలో ఫోన్‌కాల్‌కు స్పందించి ఘటన స్థలానికి చేరుకోవడం వారి సమస్య పరిష్కరించడం జరుగుందని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ డయల 100ను వాడుకోవాలని సూచించారు. 


logo