శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Feb 14, 2020 , 03:46:53

ప్రజలు జీవనశైలిని మార్చుకోవాలి

ప్రజలు జీవనశైలిని మార్చుకోవాలి

నిజామాబాద్‌ రూరల్‌ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తమ జీవనశైలిని మార్చుకున్నప్పుడే ఆరోగ్యవంతంగా ఉండే అవకాశముంటుందని ఇస్కాన్‌ గు రువు భక్తి రాఘవస్వామి మహారాజ్‌ అన్నారు. గురువారం ఖానాపూర్‌ గ్రామంలోని హనుమాన్‌ మందిరంలో భక్తులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశం వ్యవసాయ దేశంగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో రసాయనిక ఎరువులతో పంట సాగు చేయకుండా సేంద్రియ పద్ధతిలో పంట సాగు చేయాల్సిన అవశ్యకతను రైతులందరూ గుర్తించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. నేడు రసాయనిక ఎరువుల వాడకంతో పండించిన పంట ఉత్పత్తులను ఆహారంగా భుజించడంతో ఎన్నో అనారోగ్యాలకు గురై జీవనం కొనసాగించే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్కాన్‌ తరఫున ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. శుక్రవారం ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర భక్తి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఇస్కాన్‌ నిజామాబాద్‌ ప్రతినిధులు హరికృష్ణదాస్‌, దీన్‌దయ దాస్‌, నాగరాజు దాస్‌, ఖానాపూర్‌ మాజీ సర్పంచ్‌ కొర్వ గంగాధర్‌, గ్రామపెద్దలు సాలూగారి మోహన్‌, రాజలింగయ్య, మహేశ్‌, దిగంబర్‌, దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo