శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Feb 14, 2020 , 03:42:04

కన్నుల పండువగా.. శ్రీలక్ష్మీ అనంత పద్మనాభ స్వామి కల్యాణోత్సవం

కన్నుల పండువగా.. శ్రీలక్ష్మీ అనంత పద్మనాభ స్వామి కల్యాణోత్సవం

నిజామాబాద్‌ రూరల్‌ :  మండలంలోని మల్కాపూర్‌(ఎ) గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఆలయ అర్చకులు వెంకట రమణాచార్యులు, శ్రీనివాసచార్యులు, శ్రీధరచార్యులు, రాజేశ్వర శర్మ వేదమంత్రోచ్ఛరణల మధ్య శ్రీలక్ష్మీ అనంత పద్మనాభ స్వామి కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణాన్ని వీక్షించేందుకు నిజామాబాద్‌ రూరల్‌ మండలం, నవీపేట్‌, రెంజల్‌, నందిపేట్‌, మాక్లూర్‌, నిజామాబాద్‌ నగర ప్రాంతాల భక్తులు తరలివచ్చారు. ఉదయం సుప్రభాత సేవ, నైవేద్యం, పంచోపనిషత్తులతో అభిషేకం, హారతి, హోమం, బలిప్రదానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి కల్యాణం అనంతరం ఆలయ కమిటీ తరఫున భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శేఖర్‌గౌడ్‌, ఎంపీటీసీ శాంత, ఉపసర్పంచ్‌ వెంకట్‌రెడ్డి, గ్రామపెద్దలు గాంధారి బాగారెడ్డి, రాంరెడ్డి, దమ్మారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, సత్యంరెడ్డి, గంగాధర్‌ భక్తులు పాల్గొన్నారు. 


logo