బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Feb 13, 2020 , 00:46:38

కళాశాలలో బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయాలి

కళాశాలలో బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయాలి

డిచ్‌పల్లి, నమస్తేతెలంగాణ: తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల్లో అధ్యాపకుల, విద్యార్థుల బయోమెట్రిక్‌ హాజరును తప్పనిసరిగా నమోదు చేయాలని రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం సూచించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల సమావేశ మందిరంలో బుధవారం డైరెక్టరేట్‌ ఆఫ్‌ అకాడమిక్‌ ఆడిట్‌సెల్‌ ఆధ్వర్యంలో అనుబంధ కళాశాలల ప్రధానాచార్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రిజిస్ట్రార్‌ హాజరై మాట్లాడారు. అనుబంధ కళాశాలల పనితీరును ప్రధానాచార్యులను అడిగి తెలుసుకున్నారు. టీయూ వెబ్‌సైట్‌లో అనుబంధ కళాశాలల స్టాఫ్‌ అప్రూవల్‌, రెన్యువల్‌ పొందుపర్చాలని సూచించారు. విద్యార్థుల రీ అడ్మిషన్‌ ఫారమ్స్‌, రీ అడ్మిషన్‌ ఫీజు పెంపుదల అంశాలపై సమావేశంలో చర్చించారు. మిగిలిపోయిన కళాశాలల ఫీజులను ఈ నెల 20వ తేదీ వరకు చెల్లించాల్సిందిగా ఆదేశించారు. పీజీ కళాశాలలు నామినల్‌ రోల్స్‌ను ఆడిట్‌ ఆఫీస్‌లో అందించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆడిట్‌సెల్‌ డైరెక్టర్‌ ఆచార్య పి.కనకయ్య, అడ్మిషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బాలకిషన్‌, జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాంబాబు గోపిశెట్టి, అనుబంధ కళాశాలల అధ్యాపకులు, ఆడిట్‌ సెల్‌ ఆఫీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. logo