శనివారం 06 జూన్ 2020
Nizamabad - Feb 13, 2020 , 00:46:38

ప్రతి ఒక్కరూ హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలి

ప్రతి ఒక్కరూ హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలి

కామారెడ్డి, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ఎన్‌పీడీసీఎల్‌లో పనిచేసే ఉద్యోగులు, అధికారులు ప్రతి ఒక్కరూ హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు అన్నారు. బుధవారం వరంగలోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో జిల్లా నుంచి అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో 200/132 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణంపై సీఎండీ ఆరా తీశారు. వెంటనే పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి ఒక్కరూ హెడ్‌క్వార్టర్స్‌లో ఉంటూ పనులపై ఎప్పటికప్పుడు రిపోర్టు చేయాలని ఆదేశించారు. వర్క్‌ ఆర్డర్స్‌ పెండింగ్‌ లేకుండా చూడాలని, రెవెన్యూ కలెక్షన్లు పెంచాలని, విద్యుత్‌ ప్రమాదాలను నివారించాలని సూచించారు. విద్యుత్‌ చౌర్యానికి పాల్పడినవారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధించాలన్నారు. ఎస్‌పీఎం షెడ్డుల్లో డీటీఆర్‌ రిపేర్లు పెంచాలని తెలిపారు. లైన్‌ పెట్రోలింగ్‌ చేసిన వాటిని డైరీలో నమోదు చేయాలన్నారు. చేసే పనులను రిజిస్టర్‌లో నమోదు చేయాలని చెప్పారు. ఎనర్జీ నష్టాలను తగ్గించుకోవాలని, చెక్‌ రీడింగ్‌లు తీసుకోవాలని తెలిపారు. పవర్‌ ఫ్యాక్టర్‌ మెరుగుపరుచుకుంటే నష్టాలు తగ్గే అవకాశం ఉందన్నారు. మెటీరియల్‌లో నాణ్యతా ప్రమాణాలు ఉండేటట్లు చూసుకోవాలన్నారు. మెటీరియల్‌ తనీఖీ చేపట్టాలన్నారు. హెచ్‌టీ సర్వీసులను ప్రతి 3 నెలలకోసారి తనిఖీ చేయాలన్నారు. బిల్లు నిలిపివేసిన సర్వీసులను కూడా తనీఖీ చేసి, విద్యుత్‌ బకాయిలు వసూలు అయ్యేట్లు చూడాలన్నారు. 


logo