ఆదివారం 31 మే 2020
Nizamabad - Feb 13, 2020 , 00:43:09

ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

ధర్పల్లి : మార్చి 4 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మెప్మా పీడీ, మండల ప్రత్యేకాధికారి రాములు నాయక్‌ కళాశాల ప్రిన్సిపాళ్లకు సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఆదర్శ జూనియర్‌ కళాశాలను బుధవారం తనిఖీ చేసిన ఆయన ఇంటర్‌ పరీక్షలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ప్రిన్సిపాల్‌, అధ్యాపకులకు దిశానిర్దేశం చేశారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని, పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ఆయన వెంట ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ రాజేందర్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. 


logo