గురువారం 28 మే 2020
Nizamabad - Feb 12, 2020 , 04:02:19

17న సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలకు సర్వం సిద్ధం

17న సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలకు సర్వం సిద్ధం

ఖలీల్‌వాడి: తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రంలోని 33   జిల్లాల్లోని టీఆర్‌ఎస్‌ నాయకులు జన్మదిన వేడుకులను ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా నాయకులు, అభిమానులు ఆయనకు ఒక మొక్క నాటి కానుకగా ఇవ్వాలని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీ రామారావు దిశానిర్ధేశం చేశారు. దీంతో జిల్లాలో టీఆర్‌ఎస్‌ నాయకులు జన్మదిన వేడుకలకు రంగం సిద్ధం చేస్తున్నారు. అలుపెరుగని ఉద్యమ నాయకుడి జన్మదినం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల అభిమానాన్ని చాటుకున్న ప్రియతమ నాయకుడు సీఎం కేసీఆర్‌ అని ప్రజలు అంటున్నారు. హరితహారం కార్యక్రమంలో చేపట్టి తెలంగాణలో వాతావరణ కాలుష్య నివారణకు సీఎం ఎన్నో పథకాలను తీసుకువచ్చారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ జిల్లా కలెక్టర్లకు హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా జరపాలని, పార్టీ నాయకులను, అభిమానులను కోరారు. ఈనెల 17న ఇందూరులో పండుగ వాతావరణం నెలకొననుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌, ఎంపీపీలు, క్రీడా, సాంస్కృతిక, పర్యాటక, యువజన శాఖల అధికారులు ఒక్కొక్క మొక్క నాటే కార్యక్రమంలో పాలు పంచుకోవాలని సూచించారు. దీంతో ఇప్పటికే కార్యకర్తలు అన్నీ సిద్ధం చేస్తున్నారు. 


logo