ఆదివారం 31 మే 2020
Nizamabad - Feb 12, 2020 , 03:56:21

చెక్కుచెదరని నైజాం నిర్మాణాలు

చెక్కుచెదరని నైజాం నిర్మాణాలు

నిజాంసాగర్‌ రూరల్‌: వంద సంవత్సరాల కిందట నిర్మించిన నైజాం భవనాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయంటే నమ్మశక్యంగా లేదు కదా అవును నిజమే వాటిని చూడాలంటే నిజాంసాగర్‌ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలన్నీ  సందర్శించాల్సిందే. నిజాంసాగర్‌ ప్రాజెక్టును 1931లో నైజాం నవాబులు నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించడం కంటే ముందే అచ్చంపేట గ్రామంలో అతిథి గృహం నీటి పారుదల శాఖ కార్యాలయాన్ని నిర్మించారు. అవి నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. కార్యాలయాల్లో, అతిథి గృహాల్లో ఏర్పాటు చేసిన సీలింగ్‌ ఫ్యాన్‌, టేబుళ్లు, మంచాలతో పాటు లాకర్‌, స్నానం చేసే టబ్‌లు అన్ని నేటికీ చూడముచ్చటగా ఉన్నాయి. వాటితో పాటు అప్పట్లో వినియోగించిన విద్యుత్తు పరికరాలు ప్రాజెక్టు నిర్మించే సమయంలో వినియోగించిన సామగ్రి ఒక్కటేమిటి ప్రతి వస్తువు చూడాల్సిందే. అలాంటి సామగ్రి చాలా వరకు ఉండగా ప్రస్తుతం కొన్ని మాత్రమే ఉన్నాయి. సగం సామగ్రికి రక్షణ లేకపోవడంతో దొంగలు ఎత్తుకెళ్లారు. అంతే కాకుండా 16 గేట్ల సమీపంలో నిర్మించిన గోల్‌బంగ్లాపై నుంచి అప్పట్లో మెదక్‌ చర్చిని దర్శించుకునే వారటా.


logo