శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Feb 11, 2020 , 02:03:05

మూడోవంతు సొసైటీలు టీఆర్‌ఎస్‌ ఖాతాలో..

మూడోవంతు సొసైటీలు టీఆర్‌ఎస్‌ ఖాతాలో..

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి : సహకార సొసైటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ భారీ బోణీ కొట్టింది. ఎన్నికలకు ముందే ఏకగ్రీవాలతో 23 సొసైటీలు టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడ్డాయి. సొసైటీల ఏకగ్రీవంతో టీఆర్‌ఎస్‌ పార్టీ తన సత్తా చాట గా.. ప్రతిపక్షాలు పత్తా లేకుండా పోయాయి. సహకార సంఘాల ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన డైరెక్ట ర్లు ఏకగ్రీవం కావడం.. సొసైటీ పరిధిలోని 13 డైరెక్టర్‌ స్థానాలకు అన్నింటికీ అన్ని ఏకగ్రీవం కావడంతో 26 సొసైటీలు టీఆర్‌ఎస్‌ వశమయ్యా యి. నామినేషన్ల స్క్రూటినీ సమయానికి ఆరు సొసైటీలే ఏకగ్రీవమయ్యాయి. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ నేపథ్యంలో చాలా మంది రైతులు టీఆర్‌ఎస్‌ బలపర్చిన డైరెక్టర్‌ అభ్యర్థికి మద్దతుగా నిలబడ్డారు. స్వచ్ఛందంగా తమ తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో చాలా డైరెక్టర్‌ స్థానాలకు ఒకే నామినేషన్‌ దాఖలయ్యింది. దీంతో ఇవి ఏకగ్రీవమయ్యాయి. అలా సొసైటీ పరిధిలోని అన్ని డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం కావడంతో ఆ సొసైటీ ఏకగీవ్రమైనట్లే. కానీ, అధికారికంగా ఇప్పుడే ఆ సొసైటీలను ఏకగీవ్రమని ప్రకటించరు. ఈ నెల 15న ఎన్నికలుంటాయి. ఆ మరుసటి రోజే సొసైటీలకు చైర్మన్లను ఎన్నుకుంటారు. వీటిని కూడా బ్యాలెట్‌ ద్వారా ఎన్నుకుంటారు. చైర్మన్‌గా పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేస్తారు. ఒకే నామినేషన్‌ వస్తే వాటికి ఎన్నిక నిర్వహించకుండా.. వాటిని ఏకగ్రీవ సొసైటీగా అధికారులు ప్రకటిస్తారు. కాగా.. ఇప్పుడు 23 సొసైటీలు ఏకగ్రీవం కావడంతో 16న చైర్మన్ల ఎన్నిక కూడా ఏకగ్రీవమే కానుంది. అధికారికంగా ప్రకటించడమే లాంఛనంగా మిగిలి ఉంది. జిల్లాలో మొత్తం 89 సొసైటీలకు గాను ఇందులో 26 సొసైటీలు ఏకగ్రీవం కాగా.. ఇవన్నీ టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడ్డాయి. ఈ శుభారంభం టీఆర్‌ఎస్‌లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది. ఇక ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులే డైరెక్టర్లుగా ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో డీసీసీబీ చైర్మన్‌ పీఠంతోపాటు డీసీఎంఎస్‌ కూడా టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడం నల్లేరు మీద నడకేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 


టీఆర్‌ఎస్‌ వెంటే రైతులు : మంత్రి 

సహకార సంఘాల ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గం రికార్డు సృష్టించిందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా బాల్కొండ నియోజకవర్గ పరిధిలో ఏకగ్రీవాలు అయ్యాయని తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీ వెంట మేమున్నామనే సంకేతం రైతులు పంపారని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద మొత్తంలో ఏకగ్రీవాలు చేసినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. బాల్కొండలో 20 సొసైటీలకు గాను 10 సొసైటీలు ఏకగ్రీవం కాగా మరో 9 సొసైటీల పరిధిలోని సగానికి ఎక్కువగా డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం చేసుకొని వాటిని కూడా టీఆర్‌ఎస్‌ వశం చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాల ఏకగ్రీవాల పై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. 


ఏకగ్రీవ సొసైటీలు ఇవే.. 

తూంపల్లి, పిప్రి, ఫత్తేపూర్‌, గోవింద్‌పేట్‌, సావెల్‌, కొనపూర్‌, కొనసముందర్‌, వేల్పూర్‌, పడగల్‌, రామన్నపేట్‌, మోర్తాడ్‌, ఏర్గట్ల, ముచ్కుర్‌, కోలిప్యాక్‌, బుస్సాపూర్‌, జాడీజమాల్‌పూర్‌, సంగం, పెంటాకుర్ధు, కొత్తపల్లి, పోతంగల్‌, వర్ని, జాకోరా, హుమ్నాపూర్‌, గోవూరు, రుద్రూర్‌, రాయకూర్‌

బాల్కొండ నియోజకవర్గంలో.. : 1 సావెల్‌ 2. కొనపూర్‌  3. కోనసముందర్‌ 4. వేల్పూర్‌ 5. పడగల్‌ 6. రామన్నపేట్‌ 7. మోర్తాడ్‌ 8. ఏర్గట్ల 9.  ముచ్కుర్‌ 10. బుస్సాపూర్‌  

ఆర్మూర్‌ నియోజకవర్గంలో.. :   1 పిప్రి  2. ఫత్తేపూర్‌ 3. గోవింద్‌పేట్‌ 

బోధన్‌ నియోజకవర్గంలో : 1. జాడీజమాల్‌పూర్‌ 2.  సంగం 3.  పెంటాకుర్ధు  

నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో.. : 1. తూంపల్లి 2.  కోలిప్యాక్‌ 

బాన్సువాడ నియోజకవర్గంలో.. : 1. పోతంగల్‌ 2. వర్ని 3. హుమ్నాపూర్‌ 4. జాకోరా 5. రుద్రూర్‌ 6.  రాయకూర్‌ 7. కొత్తపల్లి 8. గోవూరు.


logo