శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Feb 11, 2020 , 02:00:58

మూడు సహకార సంఘాలు ఏకగ్రీవం

మూడు సహకార సంఘాలు ఏకగ్రీవం

ఆర్మూర్‌, నమస్తే తెలంగాణ: సహకార సం ఘాలకు నామినేషన్ల ఉపసంహరణ సోమవారం ముగిసింది. కాగా ఆర్మూర్‌ మండలంలో గోవింద్‌పేట్‌, పిప్రి, ఫత్తేపూర్‌ సొసైటీలు ఏకగ్రీవమయ్యాయి. గోవింద్‌పేట్‌లో ఇదివరకు ఆరు టీసీలు ఏకగ్రీవం కాగా పో టీల్లో ఉన్న మరో ఏడుగురు అభ్యర్థులు సో మవారం తమ నామపత్రాలు ఉపసంహరించుకున్నారు. దీంతో 13 టీసీలు ఏకగ్రీవమయ్యాయి. పిప్రి సహకార సంఘంలో ఇ ది వరకే పది టీసీలు ఏకగ్రీవం కాగా మరో ముగ్గురు అభ్యర్థులు తమ నామపత్రాలు ఉ పసంహరించుకోవటంతో ఇక్కడ కూడా సంఘంలోని మొత్తం 13 టీసీలకు సభ్యు లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫత్తేపూర్‌ సొసైటీలో 11 టీసీలు ఇదివరకే ఏకగ్రీవం కాగా 10, 11 టీసీలో పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు తమ నామపత్రాలను ఉపసంహరించుకున్నారు. దీంతో ఇక్కడ మొత్తం సంఘంలోని 13 టీసీల సభ్యులు ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు. అంకాపూర్‌ సహకార సంఘంలో 1 నుంచి 12 టీసీ స్థానాలకు అ భ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 13వ టీసీలు తోట భాజన్న, గొల్ల గంగారాం, పు ప్పాల తిరుపతి పోటీలో ఉన్నారు. పెర్కిట్‌ సొసైటీలో 17 మంది అభ్యర్థులు తమ నా మపత్రాలు ఉపసంహరించుకున్నారు. దీం తో వరుసగా 1 నుంచి 11 టీసీలు 13వ టీ సీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా 12వ టీసీలో ఇట్టెడి గంగారెడ్డి, ఇట్టెడి చిన్నసాయన్న మధ్య పోటీ నెలకొంది. ఆ లూర్‌ సహకార సంఘంలో 19మంది అ భ్యర్థులు తమ నామపత్రాలు ఉపసంహరించుకున్నారు. దీంతో 1, 7 టీసీలు స్థానాలకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. ఈనెల 15న అంకాపూర్‌ 13వ టీసీ, పె ర్కి ట్‌ సంఘంలోని 12వ టీసీ స్థానానికి ఆ లూర్‌ సహకార సంఘంలోని 11వ టీసీల కు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారు లు అభ్యర్థులకు  గుర్తులు కేటాయించారు. 

నందిపేట్‌లో 25 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం

నందిపేట్‌: మండలంలోని నాలుగు సహకా ర సంఘాలకు 25 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ కావడంతో అభ్యర్థులు నా మినేషన్ల ఉప సంహరణ చేసుకోవడంతో 25 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నాలుగు సొసైటీలకు 52 డైరెక్టర్‌ స్థానాలు ఉండగా ఇందులో 25 ఏకగ్రీవం కాగా మరో 27 స్థా నాలకు ఎన్నికలు జరగనున్నాయి. 27 స్థా నాలకు గాను 65 మంది అభ్యర్థులు పోటీ లో ఉన్నారు. మొత్తం 207 మంది నామినేషన్లు దాఖలు కాగా అందులో 142 మంది ఉప సంహరన చేసుకోగా 65 మంది బరి లో ఉన్నారు. అయిలాపూర్‌ సొసైటీలో 8 స్థానా టలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో అయిలాపూర్‌లో 4, నందిపేట్‌లో 2, వెల్మల్‌లో 1, కంఠంలో 1, డొంకేశ్వర్‌లో 6 స్థా నాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో డొంకేశ్వర్‌లో 2, నూత్‌పల్లిలో 2, నికాల్‌పూర్‌లో 1, బాద్గుణలో 1, కుద్వాన్‌పూర్‌ సొసైటీలో 8 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందు లో మారంపల్లి 2, కుద్వాన్‌పూర్‌ 1, శాపూర్‌ 1, గంగాసముందర్‌ 1, వన్నెల్‌ (కె) 1, సి ద్ధ్దాపూర్‌ 1, చింరాజ్‌పల్లిలో 3 స్థానాలు ఏకగ్రీవం కాగా ఇందులో తల్వేద 2, బజార్‌ కొ త్తూర్‌ 1 ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా చింరాజ్‌పల్లి సొసైటీలో 10 డైరెక్టర్‌ స్థానాలకు పోటాపోటీ నెలకొంది. 

మాక్లూర్‌ విండోలో 7 టీసీలు ఏకగ్రీవం

మాక్లూర్‌: మండలంలోని మాక్లూర్‌ విండో లో 13 టీసీలకు గానూ 7టీసీ స్థానాలు ఏకగ్రీవమైనట్లు కార్యాదర్శి విష్ణు తెలిపారు.  మొత్తం 13 టీసీ స్థానాలకు 40 మంది నా మినేషన్లు వేయగా 18 మంది ఉపసంహరించుకున్నారు. 7గురు అభ్యర్థులు ఏకగ్రీ వం కాగా 15మంది అభ్యర్థులు బరిలో ఉ న్నట్లు పేర్కొన్నారు.  

అమ్రాద్‌లో రెండు టీసీలు ఏకగ్రీవం

మండలంలోని అమ్రాద్‌ సింగిల్‌విండోకు నిర్వహించే 13 టీసీ స్థానాల్లో 2 స్థానాలు ఏకగ్రీవమైనట్లు కార్యదర్శి గంగారాం తెలిపారు. పోటీల్లో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించినట్లు పేర్కొన్నారు.


logo