శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Feb 11, 2020 , 01:54:44

వామ్మో చలి

వామ్మో చలి

ఖలీల్‌వాడి : ఇందూరు నగరం మూడు రోజుల నుంచి చలికి వణికిపో తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం చల్లగా ఉం టుంది. పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి.  పగటి ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయాయి. ఈదురుగాలులతో చలితీవ్రత ఎక్కువ కావడంతో ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఉపరితల ఆవర్తన ద్రోణితో ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారిందని వాతావారణశాఖ శాస్త్రవేత్త ప్రతాప్‌ తెలిపారు. ఈదురు గాలులు వీయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వైరస్‌ చల్లగా ఉండే ప్రాంతాల్లో వస్తుందనే ప్ర చారంతో  ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. చిన్నారులు, వృద్ధులు బయటకు రాని పరిస్థితి నెలకొన్నది.  వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చి ఒకేసారి పడిపోయాయి. 9 కి.మీపై భాగం లో ఉపరితల ఆవర్తన ద్రోణితో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కాగా శనివారం 32.4 గరిష్ఠ ఉష్ణోగ్రత,  కనిష్ఠ ఉష్ణోగ్రత 21.0గా నమోదైంది. ఆదివారం 25.4 గరిష్ఠ ఉష్ణోగ్రత, 17.8 కనిష్ఠ ఉష్ణోగ్రతతో పాటు 1.3 మి.మీ వర్షపాతం నమోదైంది. సోమవారం 5.6 గరిష్ఠ ఉష్ణోగ్రత, 17.6 కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


logo