గురువారం 04 జూన్ 2020
Nizamabad - Feb 10, 2020 , 02:18:13

రమణీయం రథోత్సవం..

రమణీయం రథోత్సవం..

ఎడపల్లి: మండలంలోని జాన్కంపేట్‌ గ్రామ సమీపంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆదివారం గోవింద నామస్మరణతో మార్మోగింది. ఆలయ ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన స్వామి వారి రథోత్సవంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. స్వామి వారి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి వారికి రథోత్సవం నిర్వహించారు. ఏటా నిర్వహించే రథోత్సవంలో భాగంగా ఈసారి కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు,  మండలంలోని భక్తులే గాక జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి రథోత్సవాన్ని తిలకించేందుకు భారీగా తరలివచ్చారు. లక్ష్మీనరసింహస్వామి గోవిందా.. గోవిందా.. అంటూ భక్తులు స్మరణ చేస్తూ, వందలాది మంది రథాన్ని లాగారు. రథోత్సవం అనంతరం భక్తులు శ్రీలక్ష్మి నరసింహ స్వామిని పల్లకీలో ఊరేగించారు. స్వామివారిని పల్లకీలో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. రథోత్సవానికి ముందు గ్రామ పెద్దలంతా యజ్ఞం నిర్వహించారు. రదోత్సవం అనంతరం భక్తులు స్వామి వారిని సందర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ ప్రాంగణంలో వివిధ దుకాణాలు వెలిశాయి. కార్యక్రమంలో సర్పంచ్‌ సాయిలు, ఎంపీటీసీ మంద సంజీవ్‌, గ్రామపెద్దలు, ఆలయ ఈవో శ్రీధర్‌రావు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. 

నేడు కుస్తీ పోటీలు, జాతర 

లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఆలయ ప్రాంగణంలో కుస్తీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు వివిధ ప్రాం తాల నుంచి పెద్దసంఖ్యలో కుస్తీవీరులు హాజరుకానున్నారు. పెద్ద ఎత్తున జాతర నిర్వహించనున్నారు.


logo