శనివారం 06 జూన్ 2020
Nizamabad - Feb 10, 2020 , 02:17:40

‘సహకారం’లో ఏకగ్రీవాల జోరు

‘సహకారం’లో ఏకగ్రీవాల జోరు

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి : సహకార ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతున్నది. ఎన్నికలేవైనా తిరుగులేని శక్తిగా, ప్రజల మద్దతుతో విజేతగా నిలుస్తున్నది. సర్పంచ్‌ ఎన్నికల నుంచి మొదలుకొని అన్నింటిలోనూ తనసత్తా చాటుతూ వస్తున్న టీఆర్‌ఎస్‌.. సొసైటీ ఎన్నికల్లో సైతం అదే దూకుడును ప్రదర్శిస్తున్నది. జిల్లాలో 89 సహకార సంఘాలకు ఐదు సొసైటీలు ఏకగ్రీవం కావడం, అవి టీఆర్‌ఎస్‌ ఖాతాలోనే చేరడం ఆ పార్టీ నాయకులు శుభారంభంగా భావిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో పార్టీ పై విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో సైతం వార్‌వన్‌సైడ్‌గానే ఉంటుందని గులాబీ శ్రేణులు ధీమాతో ఉన్నారు. సొసైటీ ఎన్నికలు రైతులకు సంబంధించిన ఎన్నికలు కావడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో ఆదరణ లభిస్తున్నది. దీంతో పలుచోట్ల పోటీ లేకుండా పోతున్నది. ప్ర భుత్వం రైతులపై ఆది నుంచి చూపుతూ వస్తున్న ప్రత్యేక శ్రద్ధ, పథకాల అమలు, సంస్కరణల పర్వం రైతుల్లో కొం డంత ధైర్యాన్ని నింపింది. సరిపడా సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా, రైతుబంధు, రైతుబీమా, సకాలం లో ఎరువులు, విత్తనాల సరఫరా ఇలా.. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతులకు ఎలాంటి అసౌకర్యం, కష్టనష్టా లు లేకుండా అన్నీతానై సీఎం కేసీఆర్‌ అమలు చేస్తూ వస్తున్నారు. రైతు పక్షపాత ప్రభుత్వంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌కి సహకార ఎన్నికల్లో ఎదురులేకుండా పోయింది. ప్రతిపక్షాలు తమ ఉనికి కోల్పోయి చెల్లాచెదురైన నేపథ్యంలో అధికార పార్టీ అభ్యర్థులు డైరెక్టర్‌ పదవులు దక్కించుకొనేందుకు పోటీలు పడుతున్నారు. ఆయా ని యోజకవర్గాల ఎమ్మెల్యేలతో సొసైటీల చైర్మన్ల గెలుపు బా ధ్యతను అధిష్ఠానం భుజానికెత్తడంతో అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ఐదు సొసైటీల పరిధిలో ఉన్న డైరెక్టర్‌ స్థానాలన్నీ ఏకగ్రీవమయ్యాయి. దీంతో వీటి పరిధిలో ఎన్నిక నిర్వహించే అవకాశం ఉండకపోవచ్చు. చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఆశావహులు కాకుండా ఇతరులు ఎవరూ నామినేషన్‌ వేయకపోతే వీరిని ఏకగ్రీవంగా ప్రకటించే అవకాశం ఉంది. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ఉన్న నేపథ్యంలో మరి న్ని సొసైటీలు ఏకగ్రీవ జాబితాలోకి చేరే అవకాశం ఉంది. ఇవన్నీ టీఆర్‌ఎస్‌ ఖాతాలోకే వస్తున్నాయి. కొన్ని సొసైటీల్లో 13 మంది డైరెక్టర్‌ స్థానాలకు గాను రెండు, మూడు వార్డుల స్థానాలు మినహా అన్ని ఏకగ్రీవం కావడంతో ఉపసంహరణ రోజు మిగిలిన వార్డు స్థానాల్లో కూడా ఏకగ్రీవమైతే ఆ సొసైటీ మొత్తం ఏకగ్రీవ జాబితాలోకి రానుంది. ఆ రకంగా ఎన్నికలు ప్రక్రియ లేకుండానే పలు సొసైటీలు ఏకగ్రీవంగా చైర్మన్‌, వైస్‌చైర్మన్‌, డైరెక్టర్ల పదవులను సొం తం చేసుకోనున్నాయి. ఉమ్మడి జిల్లాలో అన్ని సొసైటీల ప రిధిలో టీఆర్‌ఎస్‌ దూకుడు కనిపిస్తోంది. 144 సొసైటీల చైర్మన్లు డీసీసీబీ, డీసీఎంఎస్‌, డైరెక్టర్‌, చైర్మన్‌ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న నేపథ్యంలో వీటిని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు. 


logo