శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Feb 10, 2020 , 02:09:01

పల్లెప్రగతి-2 పనుల పరిశీలన

పల్లెప్రగతి-2 పనుల పరిశీలన

చందూర్‌: మండల కేంద్రంలో పల్లెప్రగతి పనులను ఆదివారం రాష్ట సహకార కమిషనర్‌, పల్లెప్రగతి-2 పనుల రాష్ట్ర పరిశీలకుడు వీరభద్రయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. పల్లెప్రగతిలో చందూర్‌ సర్పంచ్‌ కర్లం సాయరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. వైకుంఠధామం, డంపింగ్‌ యార్డ్‌, నర్సరీ, వీధిదీపాలు, పారిశుద్ధ్య తదితర పనులపై సమీక్ష నిర్వహించారు. పనులు బాగున్నాయంటూ సర్పంచ్‌ను అభినందించారు. అనంతరం లక్ష్మాపూర్‌ గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు బాగున్నాయని సర్పంచులను అభినందించారు. చందూర్‌ సర్పంచ్‌ను రాష్ట్ర సహకార కమిషనర్‌ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లీలావతి, ఎంపీపీ లావణ్య, లక్ష్మాపూర్‌ సర్పంచ్‌ సత్యనారాయణ, ఆర్‌ఐ మంజుల, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


logo