గురువారం 04 జూన్ 2020
Nizamabad - Feb 09, 2020 , 01:34:04

నామినేషన్లు @ 2986

నామినేషన్లు @ 2986
  • ముగిసిన సహకార ఎన్నికల నామినేషన్ల పర్వం
  • 15న పోలింగ్‌
  • నేడు స్క్రూటినీ, రేపు ఉపసంహరణనిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: సహకార ఎన్నికల్లో కీలక అంశమైన నామినేషన్ల దాఖలు పర్వం శనివారంతో ముగిసింది. మూడు రోజులుగా మొత్తం 2,986 నామినేషన్లు దాఖలు కావడం ఎన్నికలపై ఆసక్తిని పెంచుతున్నది. తొలిరోజు అంతంత మాత్రంగానే నామినేషన్లు దాఖలు కాగా.. చివరి రెండు రోజులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. రెండో రోజు 1,091 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజు శనివారం 1,658 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం జిల్లాలో 89 సహకార సంఘాలు ఉండగా.. 1,157 డైరెక్టర్‌ స్థానాల కోసం 2,986 నామినేషన్లు వచ్చాయి. పలుచోట్ల డైరెక్టర్‌ స్థానాల్లో ఒకే నామినేషన్‌ దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. కాగా, మొత్తం దాఖలైన నామినేషన్లను జిల్లాలో ఉన్న డైరెక్టర్‌ పదవులతో చూస్తే ఒక్కో డైరెక్టర్‌ పదవికి ఇద్దరు, ముగ్గురు చొప్పున పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం నామినేషన్ల పరిశీలన ఉండగా.. సోమవారం నామినేషన్లను ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. 


డైరెక్టర్‌ స్థానాలకు నామినేషన్లు ఉపసంహరించుకుంటే.. ఆ స్థానానికి ఒకటే నామినేషన్‌ ఉంటే, దాన్ని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. శనివారం పలు డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. సోమవారం ఉపసంహరణ రోజు మరిన్ని డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 15న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఆ  తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి సొసైటీకి ఒక ఎన్నికల అధికారిని నియమించారు. ఇప్పటికే సొసైటీల వారీగా నోటిఫికేషన్‌ జారీ చేయడంతో పాటు రిజర్వేషన్లు ప్రకటించి, ఓటరు జాబితాను ప్రదర్శించారు. 15న ఫలితాలు తర్వాత 16న సొసైటీల వారీగా చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎంపిక నిర్వహిస్తున్నారు. ఈ మేరకు బ్యాలెట్‌ పత్రాలను అధికారులు సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌, డైరెక్టర్ల పదవుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేయనున్నది. ఆ మేరకు నోటిఫికేషన్‌ ఆధారంగా బ్యాలెట్‌ ద్వారా ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నారు. 


చివరి రోజు 1660 నామినేషన్లు దాఖలు..    

జిల్లాలో 89 సొసైటీలు ఉండగా.. తొలిరోజు 237 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో రోజు 1091 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజు శనివారం 1658 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం ప్రతి సొసైటీ నుంచి 13 ప్రాదేశిక నియోజకవర్గాలు ఉంటాయి. ప్రతి టీసీ (టెరిటోరియల్‌ నియోజకవర్గం) పరంగా మొత్తం కలిపి 1660 నామినేషన్లు దాఖలయ్యాయి. ఒకటో టీసీ నుంచి పదమూడో టీసీ వరకు ఈ విధంగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఒకటో టీసీ నుంచి 141, రెండో టీసీ నుంచి 131, మూడో టీసీ నుంచి 122, నాలుగో టీసీ నుంచి 137, ఐదో టీసీ నుంచి 116, ఆరో టీసీ నుంచి 136, ఏడో టీసీ నుంచి 121, ఎనిమివో టీసీ నుంచి 132, తొమ్మిదో టీసీ నుంచి 135, పది టీసీ నుంచి 129, పదకొండు టీసీ 129, పన్నెండు టీసీ నుంచి 123, పదమూడవ టీసీ నుంచి 108 నామినేషన్లు దాఖలయ్యాయి.  రిజర్వేషన్ల పరంగా  ఓసీ జనరల్‌, బీసీ జనరల్‌, ఎస్టీ జనరల్‌, ఓసీ మహిళ, ఎస్సీ జనరల్‌, ఎస్సీ మహిళ రిజర్వేషన్లు ఉంటాయి. కాగా, మూడు రోజుల్లో మొత్తం 2986 నామినేషన్లు దాఖలయ్యాయి. ఐదు సొసైటీలు ఏకగ్రీవం

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: జిల్లా సహకార సంఘాల ఎన్నికలకు నామినేషన్ల ముగింపు ప్రక్రియలో ఏకగ్రీవాల జోరు కొనసాగింది. జిల్లాలో మొత్తం 89 సొసైటీలు ఉం డగా.. 5 సొసైటీలు ఏకగ్రీవమాయ్యయి. వీటి పరిధిలోని అన్ని డైరెక్టర్‌ స్థానాలకు ఒకటి చొప్పున నామినేషన్‌ దాఖలు కావడంతో ఇవి ఏకగ్రీవమయ్యాయి. వేల్పూర్‌ సొసైటీతో పాటు మెండోరా మండలంలోని బుస్సాపూర్‌, బోధన్‌ మండలంలోని జాడీజమాల్‌పూర్‌, పెంటాకుర్ధు, వర్ని పీఏసీఎస్‌లు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం సొసైటీల్లో 1,155 డైరెక్టర్‌ స్థానాలకు గాను 316 స్థానాలకు ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలు కావడంతో ఇవి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లయ్యింది. అయితే 5 పీఏసీఎస్‌ల పరిధిలో అన్ని డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం కాగా.. వీటిని అధికారికంగా ఈ నెల 10న ప్రకటించనున్నారు. 10న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఆ రోజు మరిన్ని నామినేషన్లు ఉపసంహరించుకుంటే, మరికొన్ని డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవయ్యే అవకాశాలు ఉన్నాయి. 


బాల్కొండ నియోజకవర్గంలో రెండు పీఏసీఎస్‌లు ఏకగ్రీవం.. 

బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్‌ మండలంలోని వేల్పూర్‌ సొసైటీ, మెండోరా మండలంలోని బుస్సాపూర్‌ సొసైటీ కింద మొత్తం 13కు పదమూడు స్థానాల్లో సింగిల్‌ నామినేషన్లు దాఖలు కావడంతో ఈ రెండు సొసైటీలు ఏకగ్రీవమయ్యాయి. మోర్తాడ్‌ మండలంలోని మోర్తాడ్‌ సొసైటీ పరిధిలో 2, 7, 8, 9, 10, 11, 12, 13వ వార్డులు ఏకగ్రీవమయ్యాయి. శెట్‌పల్లి సొసై టీ పరిధిలో 2, 4వ వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఏర్గట్ల మండలంలో ఏర్గట్ల సొసైటీలో 1, 5, 7, 12, 13 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. తాళ్ల రాంపూర్‌ సొసైటీ పరిధిలో 2, 3, 11, 12, 13వ వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ముప్కాల్‌ మండలంలో వేంపల్లి సొసైటీలో 2, 4 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. బాల్కొండ మండలంలో బాల్కొండ సొసైటీలో 4, 5, 7వ వార్డులు ఏకగ్రీవమయ్యాయి. భీమ్‌గల్‌ మండలంలో భీమ్‌గల్‌ సొసైటీలో 5, 7, 10, 11, 13వ వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ముచ్కుర్‌ సొసైటీలో 4, 5 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మెండోరా మండలంలో సావెల్‌ సొసైటీలో 1, 2, 3, 5, 12, 13వ వార్డులు ఏకగ్రీవమయ్యాయి. బుస్సాపూర్‌ సొసైటీలో మొత్తం పదమూడు వార్డులు ఏకగ్రీవమైనవి. వేల్పూర్‌ మండలంలో వేల్పూర్‌ సొసైటీలో మొత్తం 13 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. రామన్నపేట్‌ సొసైటీలో 9,11, 13, 13 వార్డులు, పడగల్‌ సొసైటీలో 12వ వార్డు, మోతె సొసైటీలో 3,9,10,12 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. కమ్మర్‌పల్లి మండలంలో కమ్మర్‌పల్లి సొసైటీలో 6, 7, 11 వార్డులు, చౌట్‌ప ల్లి సొసైటీలో 8వ వార్డు, కొనసముందర్‌ సొసైటీలో 8,9 వార్డులు మినహా మిగతా వార్డులన్నీ ఏకగ్రీవమయ్యాయి. చౌట్‌పల్లి సొసైటీలో కేవలం 8వ వార్డు మాత్రమే ఏకగ్రీవమైంది. 


బోధన్‌ డివిజన్‌ పరిధిలో మూడు పీఏసీఎస్‌లు ఏకగ్రీవం..  

బోధన్‌ డివిజన్‌లోని వివిధ మండలాలకు చెందిన 30 సింగిల్‌ విండోలతో పాటు నిజామాబాద్‌ డివిజన్‌లోని నవీపేట్‌ మండలంలోని 3 సింగిల్‌ విండోలకు చెందిన మొత్తం 426 డైరెక్టర్ల స్థానాలకు గాను నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. శనివారం సాయం త్రం వరకు 147 డైరెక్టర్ల స్థానాలకు ఏకగ్రీవం అయ్యాయి. మరో 279 డైరెక్టర్లకు పోటీ నెలకొంది. 147 డైరెక్టర్ల స్థానాలకు ఒకే ఒక్క అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేయడంతో సదరు డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమైనట్లు సమాచారం. కాగా, బోధన్‌ మండలంలోని పెం టాకుర్దు సింగిల్‌విండోలోని మొత్తం 13 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం అయింది. జాడీ జమాల్‌పూర్‌ సింగిల్‌ విండోకు చెందిన 12 డైరెక్టర్‌ స్థానాలకు ఏకగ్రీవమైంది. వర్ని మండలంలోని వర్నిసింగిల్‌విండోకు 13 డైరెక్టర్‌ స్థానాలకు గాను ఏకగ్రీవం అయ్యాయి.  


నిజామాబాద్‌ రూరల్‌ పరిధిలో 299 డైరెక్టర్లకు 60 ఏకగ్రీవాలు..  

నిజామాబాద్‌ రూరల్‌ పరిధిలోని డిచ్‌పల్లి మండలానికి చెంది న 4 సహకార సంఘాలకు గాను ఖిల్లా డిచ్‌పల్లి సహకార సంఘ పరిధిలో 13 డైరెక్టర్ల పదవులకు గాను ఐదు డైరెక్టర్ల పదవులకు ఒక్కో నామినేషన్‌ పత్రాలు దాఖలయ్యాయని, 5, 6, 7, 9, 10 డైరెక్టర్ల పదవులు ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా రాంపూర్‌ సొసైటీ పరిధిలో 12, 13 డైరెక్టర్‌ పదవులు ఏకగ్రీవం కాగా.. మెం ట్రాజ్‌పల్లి పరిధిలో 1, 3, 6, 8, 9 డైరెక్టర్లు ఏకగ్రీవమయ్యాయి. బర్ధిపూర్‌ సహకార సంఘ పరిధిలో 2, 3, 6, 10, 11, 13 వార్డులకు ఒక్కో నామపత్రం దాఖలయ్యాయి. ధర్పల్లి మండల పరిధి లో రామడ్గు, ధర్పల్లి, హోన్నాజీపేట్‌ సహకార సంఘాలు ఉం డగా.. రామడ్గులోని 8, 10వ డైరెక్టర్‌ ఏకగ్రీవం కాగా.. హోన్నాజీపేట్‌లోని 10, 11 డైరెక్టర్లు ఏకగ్రీవమయ్యాయి. మోపాల్‌ మం డలంలో 7,9,  రూరల్‌ పరిధిలో గుండారం సహకార సంఘంలో 1,2,3, మాధవనగర్‌లో 4,5,8,13, పాల్దా 5,12, ముత్తకుంట లో 1, నిజామాబాద్‌ సహకార సంఘంలో ఒక్కోటి ఏకగ్రీవమ య్యాయి. జక్రాన్‌పల్లి మండలంలో అర్గుల్‌ 5, 8 , కొలిప్యాక్‌, మునిపల్లి 3,4,5,6,7 సంఘాలు ఉండగా.. కొలిప్యాక్‌ సహకార సంఘ పరిధిలో 2, 4,8,10,13,  తూంపల్లి సహకార సంఘంలో 2, 4 , 6 , 8 , 12 ,13వ వార్డులకు, సిరికొండ సహకార సంఘ పరిధిలో 11వ వార్డుకు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. బోర్గాం (పి) 5,11,12,13, మోపాల్‌ 7, 9 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. నల్లవెల్లి 12వ వార్డు ఏకగ్రీవమయ్యాయి. 


ఆర్మూర్‌ సెగ్మంట్‌లో..

ఆర్మూర్‌ నియోజకర్గంలోని మొత్తం 13 సొసైటీలు ఉండగా.. వీటి పరిధిలో 169 డైరెక్టర్‌ స్థానాల కోసం నామినేషన్లు స్వీకరించారు. ఇందులో 36 డైరెక్టర్‌ స్థానాలకు ఒకటి చొప్పున నావినేషన్‌ దాఖలు కావడంతో వీటిని ఏకగ్రీవమని ప్రకటించారు. ఆర్మూర్‌ మండలంలో గల పెర్కిట్‌ సొసైటీలో 8 వార్డు, ఆలూర్‌ సొసైటీలోని 7వ వార్డు , అంకాపూర్‌ సొసైటీలో 5, 6, 7, 10, టీసీల పరిధిలో ఏకగ్రీవం కాగా.. గోవింద్‌పేట్‌ సొసైటీలో 2, 4,7, 10, 12, 13 టీసీలు, పిప్రి సొసైటీలో 1, 2, 3, 5, 6, 7, 8, 9, 11, 12, ఫత్తేఫూర్‌ సొసైటీలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 12, 13వ టీసీలలో ఏకగ్రీవమయ్యాయి. మాక్లూర్‌ సొసైటీలో 1, 7, 8 సొసైటీలు ఏకగ్రీవం కాగా.. 1వ వార్డు నుంచి అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా తండ్రి  బిగాల కృష్ణమూర్తి ఏకగ్రీవంగా డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. 


logo