బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Feb 09, 2020 , 01:31:04

ఇందూర్‌.. కూల్‌ కూల్‌

ఇందూర్‌.. కూల్‌ కూల్‌

ఖలీల్‌వాడి:  ఇందూరు నగరం శనివారం కూల్‌..కూల్‌గా మారింది. పగటి ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయాయి. దీనికి తోడు చల్లని గాలులు వీచాయి. సాయంత్రం నగరంలో చిరుజల్లులు కురిశాయి. ఉపరితల ఆవర్తన ద్రోణితో 24 గంటల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని వాతావారణశాఖ శాస్త్రవేత్త నరేందర్‌ తెలిపారు. దీంతో ఒక్కసారి ఇందూరు నగరమంతా చల్లబడింది. ఈదురు గాలులతో చల్లగా రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్‌ చల్లగా ఉండే ప్రాంతాల్లో వస్తుందనే భయం ప్రజల్లో ప్రబలుతున్నది. చిన్నారులు, వృద్ధులు బయటకు రాని పరిస్థితి నెలకొన్నది. సాయంత్రం వేళలో చిరుజల్లులు కురిశాయి. దీంతో మరింత చల్లని వాతావరణం నెలకొన్నది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చి ఒకేసారి పడిపోయాయి. 9 కి.మీ పై భాగంలో ఉపరితల ఆవర్తన ద్రోణితో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.


logo