మంగళవారం 26 మే 2020
Nizamabad - Feb 09, 2020 , 01:30:04

రూర్బన్‌ పనుల వేగవంతానికి ప్రజాప్రతినిధులు సహకరించాలి : డీఆర్డీవో

రూర్బన్‌ పనుల వేగవంతానికి  ప్రజాప్రతినిధులు సహకరించాలి  : డీఆర్డీవో

ఎడపల్లి : మండలంలోని వివిధ గ్రామాలకు రూర్బన్‌ మిషన్‌ ప్రాజెక్టులో భాగంగా నిధులు మంజూరై ఇంకా ప్రారంభం కాని పనులు వేగవం తం కావడానికి ఆయా గ్రామాల సర్పంచులు సహకరించాలని డీఆర్డీ వో రమేశ్‌రాథోడ్‌ కోరా రు. ఎడపల్లి మండలమండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం రూర్బన్‌ మిషన్‌ పనుల పై ఆయన సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ కార్యదర్శులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనేక గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మా ణం పనులు ఇంకా ప్రారంభం కాలేదని, వీటిని త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో అవసరమైన మొక్కలు మాత్రమే ఎంచుకొని పెంచాలని అన్నారు. పెంచే మొక్కలు, నాటిన మొక్కలు బతికి ఉండేలా చర్యలు తీసుకోవాల న్నారు. గ్రామ పంచాయతీల్లో కొనుగోలు చేసిన ట్రాక్టర్లను ప్రభుత్వ పనులన్నింటికీ ఉపయోగించుకోవచ్చని తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ రజితాయాదవ్‌, ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్‌, ఎంపీడీవో శంకర్‌, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. 


logo