శనివారం 06 జూన్ 2020
Nizamabad - Feb 08, 2020 , 03:39:24

మంత్రి సహకారంతో భీమ్‌గల్‌ అభివృద్ధికి కృషి

మంత్రి సహకారంతో  భీమ్‌గల్‌ అభివృద్ధికి కృషి

రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సహకారంతో భీమ్‌గల్‌ పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మల్లెల రాజశ్రీ అన్నారు. నూతనంగా ఏర్పడిన భీమ్‌గల్‌ మున్సిపాలిటీకి తొలి చైర్‌పర్సన్‌గా ఎన్నికైనందున చాలా సంతోషంగా ఉందని, శక్తివంచన లేకుండా సేవలు అందిస్తానని ఆమె తెలిపారు. పట్టణ అభివృద్ధిపై మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఒక విజన్‌ ఉందని, దానికోసం ఆయన నిరం తరం కృషిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన రాజశ్రీ.. ఇప్పుడున్న మున్సిపల్‌ కార్యాలయంలో ఇది వరకు ఉన్న గ్రామ పంచాయతీలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేశారు. ఇప్పుడు అదే కార్యాలయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పీఠాన్ని అధిరోహించారు.శుక్రవారం ఆమె ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు, లక్ష్యాలను వివరించారు.

  • తొలి చైర్‌పర్సన్‌గా పనిచేయడం సంతోషంగా ఉంది
  • ‘నమస్తే తెలంగాణ’తో భీమ్‌గల్‌ తొలి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మల్లెల రాజశ్రీ

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ/భీమ్‌గల్‌ : రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సహకారంతో భీమ్‌గల్‌ పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మల్లెల రాజశ్రీ అన్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కృషితో, రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సహకారంతో నూతనంగా ఏర్పడిన భీమ్‌గల్‌ మున్సిపాలిటీకి తొలి చైర్‌పర్సన్‌గా ఎన్నికైనందున శక్తివంచన లేకుండా సేవలు అందిస్తానని ఆమె తెలిపారు. పట్టణ అభివృద్ధిపై మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఒక విజన్‌ ఉందని, దానికోసం ఆయన నిరంతరం కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి కృషితో ఫలితాలు పట్టణ ప్రజలకు అందించడంలో నా వంతు కర్తవ్యాన్ని సంపూర్ణంగా నేరవేర్చడం తన లక్ష్యమన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన రాజశ్రీ.. ఇప్పుడున్న మున్సిపల్‌ కార్యాలయంలో ఇది వరకు ఉన్న గ్రామ పంచాయతీలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేశారు. ఇప్పుడు అదే కార్యాలయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పీఠాన్ని అధిరోహించారు. శుక్రవారం ఆమె ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు, లక్ష్యాలను వివరించారు.


నమస్తే తెలంగాణ : పట్టణ అభివృద్ధిపై మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ?

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ : పట్టణ అభివృద్ధిపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి స్పష్టమైన విజన్‌ ఉంది. పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఇప్పటికే మంత్రి నిధులు మంజూరు చేయించారు. పనులు జరుగుతున్నాయి. మంత్రి పట్టణ అభివృద్ధి బాధ్యతను భుజాన వేసుకున్నారు.ఆయన కృషి ఫలితాలను పట్టణానికి అందించడం కోసం పాలకవర్గ సభ్యులందరితో కలిసి పనిచేస్తాను.


భీమ్‌గల్‌లో తాగునీటి సౌకర్యం ఎలా ఉంది ?

ఇంటింటికీ నల్లా ఏర్పాటు చేసి తాగునీటిని అందించి ఆడపడుచులు బిందెడు నీటికోసం పడే కష్టాన్ని తీర్చాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ మిషన్‌ భగీరథ పథకం చేపట్టారు. దీని ద్వారా భీమ్‌గల్‌లో మహిళల తాగునీటి కష్టాలు తీరాయి.ఒకప్పుడు బిందెడు నీటికోసం అల్లాడిన భీమ్‌గల్‌లో.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మంత్రి పట్టణంలో తాగు నీటి తిప్పలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి వేగంగా మిషన్‌ భగీరథ పనులు పూర్తి చేయించి తొందరగా నీళ్లు అందించారు.


భీమ్‌గల్‌లో సౌకర్యాల అభివృద్ధి ఎలా జరగనుంది ?

భీమ్‌గల్‌ పట్టణ అభివృద్ధి, సౌకర్యాల కల్పనపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇది వరకే ఒక విజన్‌తో ఉన్నారు.ఆ విజన్‌ను ప్రజలకు వివరించారు. ఇందులో భాగంగా రూ.25 కోట్లతో పనులు చేపట్టారు.చాలాచోట్ల బీటీ రోడ్లు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు పనులు జరిగాయి. మరిన్ని పనులు జరుగుతాయి. పట్టణ ప్రజలకు సౌకర్యవంతంగా, ఆరోగ్యకర వాతావరణంలో కూరగాయలు, మటన్‌, చికెన్‌ మార్కెట్‌ ఒకేచోట ఏర్పాటు చేస్తాం. పట్టణంలో శ్మశాన వాటికల్లో సదుపాయాలు కల్పించే పనులు చేపడుతున్నాం. 


ఈ ప్రాంతానికి సాగునీటి సౌకర్యం కలగనుందా..?

కచ్చితంగా కలగనుంది. భీమ్‌గల్‌ సర్వతోముఖాభివృద్ధికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చేసిన ఆలోచనల్లో ఇది కూడా కీలకంగా ఉంది. భీమ్‌గల్‌ పట్టణం రైతులు, భూములు ఉన్న ప్రాంతం.కానీ, దశాబ్దాలుగా సాగునీరు లేకు అల్లాడుతున్న ప్రాంతం. కాళేశ్వరం ప్యాకేజీ-21తో పట్టణ రైతుల భూములకు కాళేశ్వరం నీళ్లు అందనున్నాయి. ఈ పనులు తొందరగా పూర్తి చేయించడానికి మంత్రి చేస్తున్న కృషిని పట్టణ ప్రజలు చూస్తున్నారు. పట్టణ సమీపంలోని కప్పలవాగు ప్రజలకు ఉపయోగపడేలా కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక చెక్‌డ్యాం కట్టించారు. మరో చెక్‌డ్యాం కట్టించడానికి కృషిచేస్తున్నారు.


మీ కుటుంబ, విద్య నేపథ్యం..?

మా అమ్మ పేరు వెంకటలక్ష్మి గృహిణి. నాన్న గణేశ్‌ వెల్డర్‌గా పని చేస్తుండేవారు. నాన్న స్వరస్తులయ్యారు. ఇద్దరు తమ్ముళ్లు మహేశ్‌, మహేందర్‌ ఉన్నారు. మాకు కొడుకు, కూతురు ఉన్నారు. బాబు శ్రీకర్‌ యూకేజీ, పాప శ్రావణి నర్సరీ చదువుతున్నారు.నేను ఎస్సెస్సీ భీమ్‌గల్‌ ప్రభుత్వ బాలిక పాఠశాలలో, ఇంటర్‌ ఇక్కడే ప్రభుత్వ కళాశాలలో చదవాను. దూర విద్యలో బీఏ పూర్తి చేశాను. నా భర్త మల్లెల లక్ష్మణ్‌ పదిహేనేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. వార్డు సభ్యుడిగా, ఉప సర్పంచ్‌గా పనిచేశారు. నాకు రాజకీయ అనుభవం లేదు.గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆరేండ్లు కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేశాను. మున్సిపల్‌గా మారిన అందులోనే చైర్‌పర్సన్‌ సేవలు అందించే అవకాశం మంత్రి ప్రశాంత్‌రెడ్డి సహకారంతో కలిగింది.ఇందుకు ఎంతో సంతోషంగా ఉంది.


మహిళల కోసం ఏం చేయనున్నారు ..?

మహిళల కోసం ప్రభుత్వపరంగా అందే పథకాలు, లబ్ధి అందించడంలో ముందుంటాను. పట్టణంలో మహిళలకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వారి ఉపాధికి బాటలు వేయించేలా కృషిచేస్తా.అనాథ పిల్లలకు చేతనైన సేవలు అందించాలని ఉంది.


logo