శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Feb 07, 2020 , 02:47:57

సీపీ కార్తికేయ శర్మ బదిలీ?

సీపీ కార్తికేయ శర్మ బదిలీ?

నిజామాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి: నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయశర్మ బదిలీ అయినట్లు తెలుస్తున్నది. రేంజ్‌ డీఐజీ శివశంకర్‌రెడ్డికి ఐజీగా ప్రమోషన్‌ వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో జిల్లాకు కొత్త సీపీ, డీఐజీ నియామకం కానున్నారు. పోస్టింగుల విషయంలో మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది. మేడారం జాతర ముగిసిన అనంతరం ఈనెల 9న పోస్టింగులు ఇచ్చే అవకాశముంది. 2006 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆరుగురు పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వం ప్రమోషన్‌ ఇచ్చింది. ఇందులో సీపీ కార్తికేయశర్మ పేరు కూడా ఉంది. సీపీగా కార్మికేయ శర్మ 2016 అక్టోబర్‌ 11న బాధ్యతలు స్వీకరించారు. జిల్లాల పునర్విభజన తర్వాత కమిషనర్‌గా అప్‌గ్రేడ్‌చేశారు. సిటీ పోలీసు యాక్టు అమలు చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన కార్తికేయ శర్మ మాదాపూర్‌ నుంచి నిజామాబాద్‌కు సీపీగా బదిలీపై వచ్చారు. 


పకడ్బందీగా సిటీ పోలీసు యాక్టును అమలు చేశారు. నేరాల నియంత్రణలో తనదైన  ప్రదర్శించారు. కార్డన్‌ సెర్చ్‌ను విరివిగా నిర్వహించారు. నేరాల నియంత్రణలో కీలక భూమిక పోషించారు. వరుస ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు. జిల్లాలో ఎలాంటి గొడవలకు తావివ్వకుండా పకడ్బందీ బందోబస్తుతో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చేశారు. కార్తికేయ శర్మ జిల్లాలో మూడేండ్ల మూడు నెలల పాటు బాధ్యతలు నిర్వర్తించారు. జిల్లాకు త్వరలో కొత్త సీపీ రానున్నారు. నిజామాబాద్‌ రేంజ్‌ డీఐడీ శివశంకర్‌రెడ్డికి ఐజీగా ప్రమోషన్‌ వచ్చింది. ఈయన 2002 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన వారు. కొద్దిరోజుల పాటు హైదరాబాద్‌ రేంజ్‌ ఇన్‌చార్జి డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. త్వరలో పోస్టింగులకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. 


logo