శనివారం 06 జూన్ 2020
Nizamabad - Feb 04, 2020 , 01:22:09

పసుపు బోర్డుపై ఎంపీ కల్లిబొల్లి మాటలు తగవు

పసుపు బోర్డుపై ఎంపీ కల్లిబొల్లి మాటలు తగవు

ఆర్మూర్‌, నమస్తే తెలంగాణ : జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పసుపు రైతుల సమస్యలు పరిష్కరిస్తానని, రైతులకు సరైన మద్దతు ధర ఇస్తానని కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక రైతులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిలపక్ష నాయకులు దేవరాం, ఏలేటి గంగారాం, దేగాం యాదాగౌడ్‌, జక్క లింగారెడ్డి, కోల వెంకటేశ్‌ మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో ప్రస్తుత ఎంపీ అర్వింద్‌ పసుపు రైతుల డిమాండ్లను పరిష్కరిస్తానని హామీనిచ్చినా గెలిచిన తర్వాత విస్మరించా రని, ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పసుపు బోర్డు ఏర్పాటు,  మద్దతు ధరపై ఎటువంటి ప్రస్తావన, నిధుల కేటాయింపు లేకపోవడం తీవ్ర నిరాశకు గురి చేస్తుందన్నారు. గెలిచిన తర్వాత 100 రోజుల్లో పసుపు బోర్డు తేకుంటే తన పదవికి రాజీనా మా చేసి రైతులతో కలిసి ఉద్యమంలో పాల్గొంటానని చెప్పిన అర్వింద్‌, నీతి నిజాయితీ ఉంటే రాజీనామా చేసి తమతో ఉద్యమంలో పాల్గొనాలన్నారు. అసలే దిగుబడి తగ్గి రైతులు  ఇబ్బందులు పడుతుంటే పంటను మార్కెట్‌కు తీసుకపోతే రూ.4500 ధర కూడా రావడం లేదని వాపోయారు. ఈ నెల 6న రైతుల బృందం నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డు సందర్శించి దళారుల ఆగడాలు, మార్కెట్‌ అధికారుల అలసత్వం తో  రైతులు నష్టపోతున్న తీరును గమనించి కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తామన్నారు. సమావేశంలో ప్రమోద్‌, రాజన్న, సాయికుమార్‌, నరేందర్‌ పాల్గొన్నారు. 


logo