సోమవారం 01 జూన్ 2020
Nizamabad - Feb 04, 2020 , 01:22:09

కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల అందజేత

కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల అందజేత

ఏర్గట్ల/ వేల్పూర్‌: ఏర్గట్ల తహసీల్‌ కార్యాలయంలో ఏర్గట్లకు చెందిన ముగ్గురికి, బ ట్టాపూర్‌కు చెందిన ఇద్దరు లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎంపీ పీ కొలిప్యాక ఉపేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ యు. సురేశ్‌, జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్‌, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు జక్కని మధుసూదన్‌ సోమవారం అందజేశారు. అనంతరం చెక్కుల మంజూరు కు కృషి చేసిన మంత్రి ప్రశాంత్‌రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గుల్లె లావణ్య, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు సున్నపు అంజయ్య, డీటీ సుజాత, ఆర్‌ఐ సదానంద్‌, వీఆర్వోలు శ్రీనివాస్‌, ప్రకాశ్‌, నాయకుడు సాగర్‌, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్‌ మండల కేంద్రంలో పలువురు బాధితులకు మం జూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను టీఆర్‌ఎస్‌ నాయకులు సోమవారం అందజేశా రు. గ్రామానికి చెందిన కూనింటి శంకర్‌కు రూ.75వేలు, రాకేశ్‌కు రూ.29వేలు, సవితకు రూ.20వేలు, కత్తి గంగుకు మంజూరైన రూ.11వేల700 సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు ను అందజేశారు. అనంతరం చెక్కుల మంజూరుకు కృషి చేసిన మంత్రి ప్రశాంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మొండి మహేశ్‌, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు బబ్బురు ప్రతాప్‌, నాయకులు భీమ ప్రసాద్‌, మహిపాల్‌, సామ మహేందర్‌, కుర్మ గంగాధర్‌, ద యాకర్‌, దత్తు తదితరులు పాల్గొన్నారు.


logo