శనివారం 06 జూన్ 2020
Nizamabad - Feb 03, 2020 , 01:54:06

నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌

నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌
  • లేదంటే జరిమానాలు చెల్లించాల్సిందే
  • నేటి నుంచి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అమలు
  • రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా పోలీసుశాఖ నిర్ణయం
  • జిల్లా వ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకోనున్న పోలీసులుబాన్సువావాడ రూరల్‌ :రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా పోలీసుశాఖ హె ల్మె ట్‌ ధరించని వాహనదారులపై కఠిన చర్యలకు సి ద్ధం అయ్యింది. ఇక నుంచి  హెల్మెట్‌ లేకుండా వా హనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకో నుం ది. హెల్మెట్‌ లేకుండా పెట్రోల్‌ బంకుకు వచ్చేవారికి పెట్రోలు పోయరాదని యజమానులకు సూ చించింది. ఇప్పటికే పోలీసుశాఖ బంకు యజమానులకు అవగాహన కల్పించింది. హెల్మెట్‌ లే కుం డా వాహనాలు నడపడంతో ప్రమాదాలకు గురై వాహనాదారులు ప్రాణాలు కోల్పోతుండడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత సంవత్సరం 2019లో 202 రోడ్డు ప్రమాదాలు జ రుగ గా 227 మంది ప్రాణాలు కోల్పోయారు. 118 మందికి గాయాలయ్యాయి. జనవరి మాసం లో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 25 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో 23 మంది మోటార్‌ సైకిళ్లను అజాగ్రత్తగా నడపడం, హెల్మెట్‌ ధరించకపోవడంతోనే ప్రాణాలు కోల్పోయి కన్నవారికి కడుపుకోత మిగిల్చిన ఘటనలు జరిగాయి. దీన్ని దృష్టి లో పెట్టుకొని నేటి నుంచి జిల్లా వ్యాప్తం గా హెల్మెట్‌ లేకుండా, సీటు బెల్టు పెట్టుకోకుండా వాహనాలను నడిపేవారిపై జరిమానాలు విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసుశాఖ సమాయత్తం అయ్యింది.  


రహదారులు రక్తసిక్తం..

హెల్మెట్‌ ధరించకపోవడం, అతివేగం, మద్యం సే వించి వాహనాలు నడపడం, సెల్‌ఫోన్‌ మాట్లాడు తూ వాహనాలు నడపడంతో రహదారులు రక్తసి క్తం అవుతున్నాయి. మూడు సంవత్సరాలుగా జ రిగిన రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే 2017 సంవత్సరంలో 381 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇందులో 152 మంది ప్రాణాలు కోల్పోగా, 553 మంది గాయాలపాలయ్యారు. 2018లో 433 ప్ర మాదాలు జరుగగా, 173 మంది  మరణించారు. 483 మంది గాయాలపాలయ్యారు. 2019 డిసెంబర్‌ చివరి నాటికి 202 రోడ్డు ప్రమాదాలు జరుగ గా, 227 మంది ప్రాణాలు కోల్పోయి, 118 మం ది గాయాల పాలయ్యారు. 2020 జనవరి చివరి నాటికి  జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది   ప్రాణాలు కోల్పోగా, 70 మంది తీవ్రగాయాలపాలయ్యారు. 25 మందిలో 23 మంది ద్విచక్రవాహనదారులే ఉండడం ఆందోళన కలిగించే అంశం.


రోడ్డున పడుతున్న కుటుంబాలు..

చిన్నపాటి నిర్లక్ష్యంతో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో జిల్లాలో అనేక మంది వాహనదారులు, ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కళ్లముందే కనబడుతున్నాయి. దీంతో వారిపై ఆధారపడిన కుటుంబీకులు రోడ్డున పడుతున్నాయి.    హెల్మెట్‌ ధరించడం ద్వారా ప్రాణ నష్టం తగ్గే అవకాశం ఉంటుంది.


హెల్మెట్‌ వినియోగిస్తేనే వాహనాల్లో పెట్రోలు..

రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా పోలీసుశాఖ ప్రమాదాల నివారణపై దృష్టిసారించింది. జిల్లాలో 75 పెట్రోలు బంకులు ఉండగా, పోలీసుశాఖ బంకు యజమానులతో అవగాహన సదస్సు ను ఏర్పాటు  చేసి హెల్మెట్‌ లేకుండా వచ్చే వాహనదారులకు పెట్రోలు పోయరాదని, ప్లాస్టిక్‌ బాటిళ్లతో వచ్చేవారికి సైతం పెట్రోలు పోయకూడదని ఆదేశించింది. రోడ్డు ప్రమాదాల నివారణకు తమవంతు సహకారం అందించాలని  కోరింది. పోలీస్‌శాఖ సూచనల మేరకు బంకు యజమానులు అంగీకరించారు. నేటి నుంచి పెట్రోల్‌ బంకుల్లో నో హెల్మెట్‌.. నో పెట్రోలు.. బోర్డులు దర్శనమివ్వనున్నాయి. మోటా ర్‌ సైకిళ్లు నడిపేవారు ఇక నుంచి తప్పని సరిగా హెల్మెట్‌ ధరించి వెళ్లాల్సిందే.

నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలే..

నిబంధనలు పాటించని వాహనదారులపై నేటి నుంచి పోలీసు శాఖ కఠిన చర్యలకు పూనుకోనుం ది. హెల్మెట్‌ లేకుండా, సీటు బెల్టు ధరించకుండా, మద్యం సేవించి, మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు, కఠిన చర్యలు తీసుకోనుంది. వాహనదారులు పోలీసు శాఖకు సహకరించాలని, రోడ్డు భద్రతా నియామాలు  పాటించి ప్రమాదాల నివారణకు తోడ్పాటు అందించాలని పోలీసుశాఖ కోరుతున్నది. 


logo