శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Feb 02, 2020 , 01:02:54

రమణీయం.. రథోత్సవం

రమణీయం.. రథోత్సవం
  • కన్నుల పండువగా నీలకంఠేశ్వరుడి రథోత్సవం కంఠేశ్వర్‌లో జన‘జాతర’
  • మార్మోగిన శివ నామస్మరణ

ఇందూరు : రథసప్తమిని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని నీలకంఠేశ్వరుడి రథోత్సవం శనివారం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ ఉత్సవం సందర్భంగా కంఠేశ్వర్‌ ప్రాంతం భక్తజన సంద్రమైంది. ఇం దూరు నగరానికి కంఠాభరణంగా వెలుగుతున్న నీలకంఠుని రథోత్సవా న్ని తిలకించేందుకు అశేష భక్తజనం తరలివచ్చింది. ఈ సందర్భం గా శివనామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగిం ది. రథసప్తమి సందర్భం గా ఉదయం ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీలకంఠుడిని ద ర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. సా యంత్రం ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్తర ద్వారం నుంచి పల్లకీలో వెలుపలికి తీసుకువచ్చారు. 


అలంకరించిన రథంపై గంగాదేవి, పార్వతీ సమేతంగా నీలకంఠుని ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరహర మహదేవ శంభో శంకర అంటూ... భక్తుల శివనామస్మరణ మధ్య రథయాత్ర ప్రారంభమైంది. ఆలయం నుంచి తల్లిఘోరీ వరకు రథయాత్ర సాగింది. ఉరేగింపులో రథా న్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఘోరీ వద్ద ప్రత్యేక పూజలు అనంతరం రథం తిరిగి ఆలయానికి చేరుకుంది. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లపై ప్రత్యేక దుకాణాలు వెలిశాయి. రథయాత్ర సందర్భంగా ఆర్మూర్‌ వైపునకు వెళ్లే వాహనాలను దారి మళ్ల్లించారు. బస్సులు జిల్లా పరిషత్‌ చౌరస్తా ఎడమ వైపు నుంచి రామాలయం, చంద్రశేఖర్‌ కాలనీ బైపాస్‌ రోడ్డు మీదుగా మళ్లించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో పటిష్ట పోలీసు బందోబస్తు కల్పించారు. రథోత్సవంలో నగర మేయర్‌ నీతుకిరణ్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సోమయ్య, ఈవో మహేందర్‌గౌడ్‌, దండు శేఖర్‌, కార్పొరేటర్లు, నాయకులు, రథోత్సవ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


logo