మంగళవారం 02 జూన్ 2020
Nizamabad - Feb 02, 2020 , 01:02:54

ఆరోగ్య కేంద్ర తనిఖీ

ఆరోగ్య కేంద్ర తనిఖీ

ఖలీల్‌వాడి : నగరంలోని మాలపల్లిలో ఉన్న అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను కలెక్టర్‌ నారాయణరెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించారు. మెడికల్‌ ఆఫీసర్‌ సయ్యద్‌ అజ్మల్‌ నైమన్‌ సెలవు పెట్టకుండా గైర్హాజరైనట్లు తెలుసుకున్నారు. తనిఖీ సందర్భంగా రోగులకు రాసి ఇచ్చే చీటిలు సరిగ్గా పాటించడం లేదని ఎవరు రాస్తున్నారో వివరాలు నమోదు చేయడం లేదని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ దవాఖానకు వచ్చే వారికి నమ్మకం కలిగేలా సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో తుకారాం పాల్గొన్నారు.


logo