శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Feb 02, 2020 , 01:01:32

రైతులకు మేలు చేసే ప్రభుత్వం మాది..

రైతులకు మేలు చేసే ప్రభుత్వం మాది..

మోపాల్‌ : రాష్ట్రంలో రెండో సారి అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్‌ది రైతు ప్రభుత్వమని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదాన్నగారి విఠల్‌రావు అన్నారు. మోపాల్‌ మండలంలో న్యాల్‌కల్‌ గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు వేసే టీకాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సీజనల్‌ వ్యాధులు వ్యాపించకుండా పశువులను కాపాడుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా మన రాష్ట్రంలో అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. రైతు రుణమాఫీ, మద్దతు ధర, రైతు బీమా, పాడి గేదెల పెంపకం, విజయడెయిరీ ద్వారా పాల సేకరణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి బాలిక్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. జిల్లాలో 3.81, 500 పశువులున్నాయని, వీటికి టీకాలు వేసేందుకు 98 టీమ్‌లు పనిచేస్తున్నాయని తెలిపారు. గడ్డి విత్తనాలు, పశుదాణ, కటింగ్‌ యంత్రాలు సబ్సిడీపై రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల పశువైద్య అధికారి ప్రమోద్‌ కుమార్‌, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌ శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్‌ గంగాప్రసాద్‌, ఎంపీటీసీ నీలం లక్ష్మి, సొసైటీ చైర్మన్‌ ఉమాపతి రావు, విజయ డైరీ జిల్లా మేనేజర్‌ నందకుమారి, టీఆర్‌ఎస్‌ నాయకులు కన్నెరాం నాయక్‌, నాగేశ్వర్‌రావు, సతీశ్‌, భరత్‌ తదతరులు పాల్గొన్నారు. 


logo