శనివారం 30 మే 2020
Nizamabad - Feb 02, 2020 , 00:50:11

ఆత్మ విశ్వాసంతో చదివితేనే విజయం సాధ్యం

ఆత్మ విశ్వాసంతో చదివితేనే విజయం సాధ్యంబోధన్‌, నమస్తే తెలంగాణ / వర్ని : ఆత్మవిశ్వాసంతో చదవాలని, సరైన లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా చదివిన విద్యార్థులు విజయం సాధిస్తారని సాఫ్ట్‌ స్కిల్‌ ట్రైనర్‌ కేవీ ప్రసాద్‌ అన్నారు. శనివారం వర్ని మండల కేంద్రంలోని వీఎంఆర్‌ ఫంక్షన్‌హాల్‌, సాయంత్రం బోధన్‌ పట్టనంలోని ఏఆర్‌ గార్డెన్‌లో ప్రైవేట్‌ విద్యాసంస్థల పదో తరగతి విద్యార్థులకు ‘విజయ స్ఫూర్తి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రసాద్‌ మాట్లాడుతూ నేను చేయగలను అన్న ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధమవ్వాలన్నారు. 46 రోజుల్లో ఎస్సెస్సీ పరీక్షలు జరగబోతున్నాయని, ఈ 46 రోజులకు ఎంతో ప్రాధాన్యత ఉందని, సమయం వృథా చేయకుండా ఒక పద్ధతి ప్రకారం చదవాలని చెప్పారు.  విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమం ముగింపులో ప్రసాద్‌ను ప్రైవేట్‌ విద్యాసంస్థల నిర్వాహకులు వై.శ్రీనివాస్‌, ఐఆర్‌ చక్రవర్తి. జయప్రకాష్‌, రాజు తదితరులు సన్మానించారు. logo