గురువారం 28 మే 2020
Nizamabad - Feb 01, 2020 , 02:34:07

నేడు నీలకంఠేశ్వరుడి రథోత్సవం

 నేడు నీలకంఠేశ్వరుడి  రథోత్సవం
  • ముస్తాబైన ఆలయం
  • నేడు రథసప్తమి వేడుకలు.. జాతర ప్రారంభం

ఖలీల్‌వాడి : దశాబ్దాల ఆధ్యాత్మిక చరిత్ర ఉన్న నీలకంఠేశ్వరుడు నేడు కొలువుదీరనున్నాడు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రథసప్తమి వేడుకలకు అంతా సిద్ధం చేశా రు. అంగరంగ వైభవంగా ప్రతి ఏటా జరుపుకొనే ఈ వేడుకల ను కంఠేశ్వర్‌ జాతర నామకరణంతో ప్రాచూర్యంలో ఉంది. జిల్లా కేంద్రంలోనే అతి పెద్ద జాతరగా ప్రసిద్ధి చెందింది. ఇందూరు నగరానికి ఈశాన్య భాగంలో స్వయంభూలింగాకారంలో ఈశ్వరుడు కొలువైన కొవెల. 1400 ఏండ్ల క్రితమే నిర్మితమై జిల్లాకు తలమానికంగా.. నగరానికి కంఠాభరణంగా నిలుస్తున్న పురాతన ఆలయం నీలకంఠేశ్వర ఆలయం. 


ఆలయం ముస్తాబు..

మంగళవారం రథసప్తమి సందర్భంగా నీల కంఠేశ్వరుని ఆలయం ముస్తాబైంది. రెండు రోజలు పాటు కొనసాగే జాతరకు జిల్లావాసులే కాక.. మహారాష్ట్ర నుంచి భక్తులు స్వామి దర్శనం కోసం వస్తుంటారు. ఈ సప్తమిని చక్కెరతీర్థం అని పి లుస్తారు. మాఘశుద్ధ సప్తమిని రోజున నిర్వహించే రథ యాత్రను స్వామి వారి విమానరథయాత్ర అని పిలుస్తారు. ఈ సందర్భంగా స్వామి వారికి అభిషేకాలు, బిల్వపత్ర పూజలు నిర్వహించనున్నారు. 1400 ఏండ్ల క్రితం నిర్మించిన ఈ ఆల యం ఎంతో ప్రసిద్ధిగాంచింది. శాతవాహన వంశస్థులైన రెండో పులకేశి జైనమత ప్రచారానికి ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అదే స్థలంలో శివుడు స్వయంభూ లింగేశ్వరుడిగా నిలిచాడు. శాతవాహన కాలంలో ఈ ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత శిల్పి మాఘ శుద్ధ సప్తమి రోజున శిఖర స్థాపన చేయాలని నిర్ణయించుకున్న సమయంలో రోజు మాదిరిగానే అతని తల్లి అన్నం తీసుకొని వచ్చిం ది. శిల్పి అమావాస్య రోజున శిఖర స్థాపన చేస్తున్నా.. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్లిపో అని చెప్పారు. ఆ మాట విన్న తల్లి కొద్దిదూరం ప్రస్తుతం తల్లిఘోరి ఉన్న చోట వరకు వెళ్లి తన కొడుకు ఇలా ఎందకు చెప్పాడో అనుకుంటూ వెనక్కి తిరిగింది. దీంతో శిల్పి అదృశ్యం కావడం.. ఆ దుఃఖాన్ని భరించలేక తల్లి సమాధి కావడం వెంటవెంటనే జరిగిపోయాయి. అందుకే రథయాత్రను తల్లిఘోరి వరకు సాగిస్తారు. 


ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లుపూర్తి..

రథయాత్రకు సంబంధించి ఇటీవల ఆలయ కమిటీ సభ్యు లు రథాన్ని పరిశీలించి తగిన మరమ్మతులు చేశారు. తోరణా లు, బంతిపూలతో రథాన్ని అందంగా అలంకరించారు. రథ యాత్ర సందర్భంగా కంఠేశ్వర్‌ పరిసర ప్రాంతాల్లో జనం జాతరతో కిక్కిరిసిపోతుంది. రోడ్డుకిరువైపులా జనసందోహం కనిపిస్తుంది. దశాబ్దాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని కంఠేశ్వర్‌ జాతర గానూ జరుపుకొంటారు. కంఠేశ్వర్‌ ఆలయానికి ఇరువైపులా సుమారు తల్లి ఘోరి వరకు దుకాణాలతో భక్తులు, సందర్శకుల సందడితో కిక్కిరిసిపోతుంది. 


ముస్తాబైన ఆలయం.. 

చిన్నలు, పెద్దలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే సమయం ఆసన్నమైంది. ప్రతి సంవత్సరం జరుపుకొనే ఈ వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానికంగా ఉండి ప్రస్తు తం వివిధ దూర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం తమ పుట్టినింటికి చేరుకుంటారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు సెలవు ప్రకటిస్తారు. ఉదయం సుప్రభాత సేవ కార్యక్ర మం, స్వామి వారికి అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. సాయంత్రం రథయాత్ర  కంఠేశ్వర్‌ ఆలయం నుంచి తల్లి ఘోరి వరకు నిర్వహిస్తారు. ఈ రథయాత్రను లోక కల్యాణం కోసం నిర్వహిస్తారని, దీంతో ప్రజలు సుఖశాంతులతో ఉంటారని భక్తుల నమ్మకం. రథసప్తమి వేడుకల సందర్భంగా  కంఠేశ్వర్‌ ఆలయం ఎల్‌ఈడీ సిరీస్‌తో రంగురంగుల విద్యుద్దీప కాంతులతో  ముస్తాబైంది. ఇరువైపులా దుకాణలు వెలిశాయి. తిను బండారాలు, పూలు, కొబ్బరి కాయలు , చిన్న పిల్లల ఆట వస్తువుల దుకాణాలు కళకళలాడుతున్నాయి. శనివారం  చక్రతీర్థ నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు భక్తులు పెద్దసంఖ్యలో పాల్గ్గొననున్నారు. ఆలయ కమిటీ వారు ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు.


ట్రాఫిక్‌ మళ్లింపు..

రథసప్తమి వేడుకల సందర్భంగా కంఠేశ్వర్‌లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. రైలే కమాన్‌ నుంచి కంఠేశ్వర్‌ (ఆర్మూర్‌ రోడ్డు) వైపునకు వెళ్లే వాహనాలు ప్రస్తుతం జిల్లా పరిషత్‌ చౌరస్తా నుంచి ఎడమ వైపునకు వెళ్తున్న వాహనాలను శనివా రం  ఉదయం నుంచి సుభాష్‌నగర్‌లోని రామాలయం రోడ్డు, వుమెన్స్‌ కాలేజీ వైపునకు మళ్లించనున్నారు. 


logo