శనివారం 30 మే 2020
Nizamabad - Feb 01, 2020 , 02:31:43

మొదటి రోజు బ్యాంకర్ల సమ్మె విజయవంతం

మొదటి రోజు బ్యాంకర్ల సమ్మె విజయవంతం
  • జిల్లాలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతం
  • ఇబ్బందులు ఎదుర్కొన్న ఖాతాదారులు

బోధన్‌, నమస్తే తెలంగాణ / ఇందూరు : దేశవ్యాప్తంగా యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ పిలుపుమేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు శుక్రవారం సమ్మె చేశారు.   అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు  శుక్రవారం మూతపడ్డాయి. మొదటిరోజు సమ్మెతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రా బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌ తదితరవి మూసివేశారు. బ్యాంకింగ్‌ ఉద్యోగులు నగరంలో, బోధన్‌ పట్టణంలోని వివిధ బ్యాంకుల వద్ద ధర్నాలు చేసి, ర్యాలీ నిర్వహించారు. బోధన్‌లో బ్యాంకింగ్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు సీఐటీయూ బోధన్‌ పట్టణ నాయకలు మద్దతు తెలిపారు. బ్యాంక్‌ ఉద్యోగులు నిర్వహించిన ర్యాలీలో వారు పాల్గొన్నారు. logo