శనివారం 06 జూన్ 2020
Nizamabad - Feb 01, 2020 , 02:20:11

సమాజంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి

సమాజంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి

బోధన్‌, నమస్తే తెలంగాణ : సమాజంలో నిత్యం జరుగుతున్న విషయాలపైనా, సమాజం లో ఎలా ప్రవర్తించాలన్న అంశంపైనా విద్యార్థుల కు ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని బోధన్‌ ఏసీపీ జైపాల్‌రెడ్డి అన్నారు. బోధన్‌ పట్టణంలోని సెయింట్‌ థామస్‌ బీఈడీ కళాశాల, ఇందూర్‌ బీఈడీ కళాశాలల్లో ఐదు రోజులుగా ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ‘నిష్ట’ నాలుగో విడత శిక్షణ శిబిరం నిర్వహించారు. బోధన్‌, వర్ని, కోటగిరి, రుద్రూర్‌, చందూర్‌, మోస్రా, ఎడపల్లి, రెంజల్‌ మండలాల్లోని ఉపాధ్యాయుల కోసం ఈ శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏసీపీ జైపాల్‌రెడ్డి మాట్లాడు తూ.. మనస్సును అదుపులో పెట్టుకొని మెలిగేలా విద్యార్థులకు పాఠాలు నేర్పాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు మంచి అలవాట్లు నేర్చుకొనేలా చిన్నప్పటినుంచే తయారు చేయాలన్నారు. విద్యార్థుల అలవాట్లు, ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులపైనా ఉందన్నారు. దేశ భవిష్యత్తు ఉపాధ్యాయులు విద్యార్థులకు ఎలా బోధిస్తున్నారన్నదానిపై ఆధారపడి ఉందన్నారు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్‌, బోధన్‌ ఎంఈవో శాంతకుమారి, స్టేట్‌ రిసోర్స్‌ పర్సన్స్‌ శ్రీనివాస్‌రెడ్డి, హనుమంతరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. logo