గురువారం 04 జూన్ 2020
Nizamabad - Jan 31, 2020 , 03:34:18

‘సహకార’ సమరం

‘సహకార’ సమరం

ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. డీసీసీబీ విభజన జరగనందున సహకార ఎన్నికలు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 142 సహకార సంఘాలుండగా.. ఇందులో నిజామాబాద్‌ జిల్లాలో 89 ఉన్నాయి. 2018 డిసెంబర్‌ 31 వరకు ఓటర్లుగా నమోదై ఉన్నవారికి మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు వేసే వీలుంది. - నిజామాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి

  • మోగిన ఎన్నికల నగరా
  • జిల్లాలో మొత్తం 89 సహకార సంఘాలకు ఎన్నికలు
  • ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఎన్నికలు
  • షెడ్యూల్‌ విడుదల చేసిన సర్కార్‌
  • ఫిబ్రవరి 3న సొసైటీల వారీగా నోటిఫికేషన్‌
  • 5 నుంచి 7 వరకు నామినేషన్ల స్వీకరణ
  • 8న స్క్రూటినీ, 9న ఉపసంహరణ
  • ఈ నెల 15న పోలింగ్‌.. అదే రోజు ఫలితాలు

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి : ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘాల (పీఏసీఎస్‌)కు ఎన్నికల నగారా మోగింది. ఒక్కొక్కటిగా అన్ని ఎన్నికలు నిర్వ హిస్తూ వస్తున్న ప్రభుత్వం .. ఇక మిగిలి ఉన్న సహకార ఎన్నికలను కూడా పూర్తి చేయ నుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం సమావేశం ఏర్పా టు చేసి .. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో గురువారం రాష్ట్ర సహకార సంఘం ఎన్నికల అధికారులు ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 


15 రోజుల వ్యవధిలో మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేలా షెడ్యూల్‌ను రూపొందిం చారు. ఫిబ్రవరి 3న సొసైటీల వారీగా జిల్లా సహకార అధికారి నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. ఈ నెల 5 నుంచి 7 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 8న నామినేషన్ల స్క్రూటి నీ ఉండగా.. 9న ఉపసంహరణ ఉంటుంది. 15న ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. పార్టీల గుర్తులేకుండా బ్యాలెట్‌ పత్రాలతో ఈ ఎన్నిక లు జరుగుతాయి. 16న అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. ఫలితాలు వెలువడిన మూడు రోజుల్లో డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లతో పాటు 23 మంది ఆఫీసు బేరర్ల ఎన్ని కను నిర్వహిస్తారు. 


ఉమ్మడి జిల్లాకు ఎన్నిక..

సహకార ఎన్నికలు ఉమ్మడి జిల్లాకు జరగనున్నాయి. డీసీసీబీ విభజన జరగనందున ఈ ఎన్నికలు రెండు జిల్లాలకు కలిపి నిర్వహిస్తారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 142 సహ కార సంఘాలుండగా.. ఇందులో నిజామాబాద్‌ జిల్లాలో 89 ఉన్నాయి. మరో మూడు సంఘాలు జిల్లాలో పెంచాల్సింది. బాల్కొండ, చందూరు, నిజామాబాద్‌ నార్త్‌ (అర్స పల్లి)లో మూడు సహకార సంఘాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతి పాదనలు పంపారు. 


వీటిపై ఇంకా స్పష్టత రాకముందే ఎన్నికల నగారా మోగడంతో ఈ నిర్ణయాన్ని విరమించుకున్నారు. మొత్తం ఓటర్లు 1.16 లక్షల మంది ఉన్నారు. 2013లో సహకార ఎన్నికలు జరిగాయి. 2018 ఫిబ్రవరి నెలలో పాలకవర్గం పదవీ కాలం ముగిసింది. ఆరు నెలలు పాటు మొత్తం నాలుగు సార్లు కాలపరిమితిని ప్రభు త్వం పొడిగిస్తూ వచ్చింది. ఫిబ్రవరి 10 వరకు చివరగా పొడిగించిన గడువు ముగు స్తుంది. కాగా.. ఈ నెల 15న ఎన్నికలు ముగిసి చైర్మన్‌ను ఎన్నుకొనే వరకు ప్రస్తుతం ఉన్న డీసీసీబీ చైర్మన్‌ పదవిలో కొనసాగనున్నారు. ప్రతి పీఏసీఎస్‌కు 13 సెగ్మెంట్లుగా విభజిస్తారు. 


ఇందులో పది ఓసీ, బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ చొప్పున తీసుకొని ఆ మేరకు ఏ పీఏసీఎస్‌లో ఎవరి ఓట్లు ఎక్కువగా ఉంటాయో వారికి రిజర్వేషన్‌ను కేటా యిస్తారు. ఈ రిజర్వేషన్ల ఆధారంగా పీఏసీఎస్‌ చైర్మన్‌ కోసం పోటీ చేస్తారు. పార్టీ రహిత ఎన్నిక కావడంతో గుర్తులు కేటాయిస్తారు. బ్యాలెట్‌ పత్రాల ద్వారా ఎన్నిక నిర్వహి స్తారు. మెజార్టీగా గెలిచిన చైర్మన్లు డీసీసీబీ చైర్మన్‌ను చేతి ఎత్తే పద్ధతిలో ఎన్నుకుంటారు. జిల్లా ఆఫీసు బేరర్లను కూడా పీఏసీఎస్‌ చైర్మన్లు ఎన్నుకుంటారు. మొత్తం 23 మంది డీసీసీబీ డైరెక్టర్ల ఎన్నిక ఉంటుంది. 


ఇందులో సొసైటీ సంఘాల ద్వారా ఎన్నికైనవారు 18 మంది ఉండగా.. మరో ఐదుగురు మత్స్యకార, ఇతర సంఘాల నుంచి డైరెక్టర్ల కోసం పోటీ చేస్తారు. 18 మంది ఏ క్లాస్‌గా, ఐదుగురిని బీ క్లాస్‌గా పరిగణిస్తారు. ఇం దులోనూ రిజర్వేషన్లు ఉంటాయి. పదిశాతం ఓసీ, బీసీ, రెండు శాతం ఎస్సీ, ఒక శాతం ఎస్టీలకు కేటాయిస్తారు. వీరిని పీఏసీఎస్‌లు ఎన్నుకోవాల్సి ఉంటుంది. కాగా.. ఇప్పటికే పలుమార్లు కొత్త సభ్యుల నమోదు కోసం దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అదనంగా ఐదారువేల మంది వరకు కొత్తగా నమోదు చేసుకున్నా.. 2018 డిసెంబర్‌ 31 వరకు నమోదై ఉన్నవారికి మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు వేసే వీలుంది.


logo