బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Jan 31, 2020 , 03:25:00

ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం ప్రారంభం

ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం ప్రారంభం
  • ఆర్మూర్‌లో ప్రారంభించిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
  • ఏ సమస్య వచ్చినా నేరుగా క్యాంప్‌ కార్యాలయానికి రండి
  • ప్రజలకు సూచించిన ఎమ్మెల్యే

ఆర్మూర్‌, నమస్తే తెలంగాణ: వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకోని ఆర్మూర్‌ పట్టణంలోని తహసీల్‌ కార్యాలయంలో రూ. కోటి నిధులతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయాన్ని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఉదయం 4 గంటల సమయంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి- రజితారెడ్డి దంపతుల చేత వేదపండితుడు బాల్యపల్లి సుబ్బారావు ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయాన్ని చేపట్టిందన్నారు. 


ఆర్మూర్‌ నియోజకవర్గంలోని ప్రజలకు ఏ సమస్య వచ్చినా కార్యాలయంలో సంప్రదించి సమస్యను పరిష్కారించుకోవలన్నారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పండిత్‌ వినీతపవన్‌, వైస్‌ఛైర్మన్‌ షేక్‌మున్నా, ఎంపీపీలు పస్క నర్సయ్య, వాకిడి సంతోష్‌రెడ్డి, మాస్త ప్రభాకర్‌, జడ్పీటీసీ మెట్టు సంతోష్‌, వైస్‌ ఎంపీపీలు, సొసైటీ ఛైర్మన్‌లు, కౌన్సిలర్లు, సర్పంచిలు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.


logo