బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Jan 30, 2020 , 04:05:56

మంత్రి కేటీఆర్‌ను కలిసిన నిజామాబాద్‌ మేయర్‌, కార్పొరేటర్లు

మంత్రి కేటీఆర్‌ను కలిసిన  నిజామాబాద్‌ మేయర్‌, కార్పొరేటర్లు

ఖలీల్‌వాడి : రాష్ట్ర టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీ రామారావును అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా ఆధ్వర్యంలో నగర మేయర్‌ నీతూ కిరణ్‌, నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు హైదరాబాద్‌లో కలిశారు. మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.


బోధన్‌, నమస్తే తెలంగాణ: బోధన్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన తూము పద్మావతి, వైస్‌ చైర్మన్‌ సోహైల్‌, కౌన్సిలర్లు హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ను బుధవారం మధ్యాహ్నం కలుసుకున్నారు. బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ వీరిని కేటీఆర్‌కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ తూము పద్మావతి, వైస్‌ చైర్మన్‌ సోహైల్‌తో పాటు కౌన్సిలర్లు కేటీఆర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి కృతజ్ఞతలు తెలిపారు. 


ఈ సందర్భంగా తూము పద్మావతి మాట్లాడుతూ.. బోధన్‌ పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు అభివృ ద్ధి పనులు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్‌ను కో రారు. అంతకుముందు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని కలుసుకొన్నారు. హైదరాబాద్‌లో కేటీఆర్‌, మంత్రి ప్రశాంత్‌రెడ్డిని కలుసుకున్నవారిలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కౌన్సిలర్లు తూము శరత్‌రెడ్డి, ఎం.గుణప్రసాద్‌, ధూప్‌సింగ్‌, ధూళిపాల పౌల్‌, కొండ్ర పద్మ, టీఆర్‌ఎస్‌ బోధన్‌ నియోజకవర్గ నాయకులున్నారు. జిల్లా ఎమ్మెల్సీ వీజీగౌడ్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావునూ వీరు కలుసుకున్నారు.


logo