గురువారం 04 జూన్ 2020
Nizamabad - Jan 30, 2020 , 04:04:21

నేటినుంచి బాధ్యతల్లోకి..

నేటినుంచి బాధ్యతల్లోకి..

నూతనంగా ఎన్నికైన మేయర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకొన్నారు. మున్సిపల్‌ అధికారులు చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఛాంబర్లను సిద్ధం చేస్తున్నారు.

  • బాధ్యతలు స్వీకరించనున్న మేయర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు
  • ఏర్పాట్లు చేసిన మున్సిపల్‌ అధికారులు
  • హాజరుకానున్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు

నేడు మేయర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న నీతూ కిరణ్‌ 

ఖలీల్‌వాడి: మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 11వ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందిన నీతూ కిరణ్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్ఠానం ఆశీస్సులతో మేయర్‌ పదవిని దక్కించుకున్నారు. నగరంలోని మున్సిపల్‌ కార్యాలయంలో ఉన్న మేయర్‌ చాంబరులో గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు హాజరుకానున్నారు. ఇందుకోసం మున్సిపల్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వినీత బాధ్యతల స్వీకరణ   

ఆర్మూర్‌, నమస్తే తెలంగాణ : ఆర్మూర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో గురువారం మున్సిపల్‌ నూతన చైర్‌పర్సన్‌ పండిత్‌ వినీత బాధ్యతలు స్వీకరించనున్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో గురువారం  ఉదయం 10 గంటలకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పండిత్‌ వినీత, వైస్‌చైర్మన్‌ షేక్‌ మున్నా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ ఆదుముల్ల శైలజ బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి హజరుకానున్నారు. 


బోధన్‌ మున్సిపల్‌ 15వ చైర్‌పర్సన్‌గా పద్మావతి 

నేడు పదవీ బాధ్యతల స్వీకరణ 

బోధన్‌, నమస్తే తెలంగాణ : బోధన్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన తూము పద్మావతి గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. గురువారం వసంత పంచమి.. శుభదినం కావడంతో అదే రోజున పదవీ బాధ్యతలు చేపట్టాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆమె మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా చార్జి తీసుకుంటారు. బోధన్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా ఎన్నికైన మహ్మద్‌ ఎత్తేశ్యామ్‌ అలియాస్‌ సోహైల్‌ కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ పదవీ బాధ్యతల స్వీకరణ సందర్భంగా వారికి ప్రత్యేకంగా చాంబర్లను కేటాయించారు. 


logo