శనివారం 30 మే 2020
Nizamabad - Jan 30, 2020 , 03:57:08

బైక్‌తోసహా డ్రైనేజీలో పడి ఒకరు మృతి

బైక్‌తోసహా డ్రైనేజీలో పడి ఒకరు మృతి

కామారెడ్డి నమస్తే తెలంగాణ: బైక్‌తో సహా మురికి కాలువలో పడి ఒకరు మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి  వచ్చింది. పట్టణ ఎస్సై గోవింద్‌, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన పెద్దోల్ల రాజేశ్వర్‌రావు(45) తన బైక్‌పై వెళ్తుండగా జీవదాన్‌ రోడ్డులోని వాణి బీడీ కంపెనీ వద్ద అదుపుతప్పి మురికి కాలువలో పడి మృతి చెందాడు. రాజేశ్వర్‌రావు మంగళవారం సాయంత్రం తన కూతురు రసజ్ఞను జీవదాన్‌ పాఠశాల నుంచి తీసుకెళ్లి ఇంటి వద్ద దింపి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. రాజేశ్వర్‌ రావు ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు బుధవారం దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవునిపల్లి పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. బుధవారం సాయంత్రం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని  బయటకు తీసి పోస్టుమార్టం కోసం కామారెడ్డి ఏరియా దవాఖానకు తరలించారు. మృతుడికి భార్య సుజాత, కూతురు రసజ్ఞ ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై తెలిపారు. రాజేశ్వర్‌రావు మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరో హత్యచేసి మురికికాలువలో పడవేసి ఉంటారని అంటున్నారు. మృతుడి శరీరంపై గాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. పోలీసులు విచారణ జరిపి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరారు.


logo