శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Jan 29, 2020 , 01:11:16

మంత్రి కేటీఆర్‌ను కలిసిన భీమ్‌గల్‌ బల్దియా పాలకవర్గం

మంత్రి కేటీఆర్‌ను కలిసిన భీమ్‌గల్‌ బల్దియా పాలకవర్గం

భీమ్‌గల్‌ : భీమ్‌గల్‌ మున్సిపాలిటీ నూతన చైర్మన్‌ మల్లెల రాజశ్రీ, వైస్‌ చైర్మన్‌ గున్నాల బాల భగత్‌, కౌన్సిలర్లు మంగళవారం మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్‌ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను హైదరాబాద్‌లో కలిశారు. నూతనంగా పాలక వర్గం ఏర్పడిన సందర్భాన్ని పురస్కరించుకొని వారు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలువగా మంత్రి కేటీఆర్‌ వారిని అభినందనలు తెలిపారు. భీమ్‌గల్‌ పట్టణాభివృద్ధికి భారీగా నిధులు అందించినందుకు మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, ఎంపీపీ ఆర్మూర్‌ మహేశ్‌, జడ్పీటీసీ చౌట్‌పల్లి రవి, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్‌ శర్మా నాయక్‌, టీఆర్‌ఎస్‌ బాల్కొండ నియోజక వర్గ సమన్వయ కమిటీ సభ్యుడు గుణ్వీర్‌ రెడ్డి, ఎండీ అహ్మద్‌ హుస్సేన్‌, భీమ్‌గల్‌ పట్టణ అధ్యక్షుడు మల్లెల ప్రకాశ్‌, పసుల ముత్తెన్న, మల్లెల ప్రసాద్‌, రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

మంత్రికి ధన్యవాదాలు తెలిపిన పాలక వర్గం.. 

భీమ్‌గల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మల్లెల రాజశ్రీ, వైస్‌ చైర్మన్‌ గున్నాల బాల భగత్‌, కౌన్సిలర్లు మంగళవారం మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిని హైదరాబాద్‌లో ఆయన నివాసంలో కలిశారు.పాలక వర్గం నూతనంగా ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకొని మంత్రిని కలిసి భీమ్‌గల్‌ పట్టణ అభివృద్దికి కృషి చేసి తమ గెలపునకు కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించారు.భీమ్‌గల్‌ పట్టణ అభివృద్ధికి పాటు పడాలని మంత్రి వారికి సూచించారు.


logo