ఆదివారం 31 మే 2020
Nizamabad - Jan 29, 2020 , 01:05:36

అవినీతి రహిత పాలన అందించాలి

అవినీతి రహిత పాలన అందించాలి

ఆర్మూర్‌, నమస్తే తెలంగాణ : ప్రజలకు పారదర్శకంగా, అవినీతి రహితంగా పాలనను అందించాలని మంత్రి కేటీఆర్‌ నూతన  పాలకవర్గ సభ్యులకు సూచించారు. ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా అభిమానాన్ని సంపాదించుకోవాలన్నారు. రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పీయూసీ ఛైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి సమక్షంలో ఆర్మూర్‌ బల్దియా నూతన పాలకవర్గ సభ్యులు మంగళవారం కలిశారు. ఆర్మూర్‌ టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో రెండు బస్సుల్లో పాలకవర్గ సభ్యులు, పలువరు టీఆర్‌ఎస్‌ నాయకులు హైదరాబాద్‌ తరలివెళ్లారు. మంత్రి కేటీఆర్‌కు ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి సమక్షంలో ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పండిత్‌ వినీత, వైస్‌ చైర్మన్‌ షేక్‌మున్నా  పుష్పగుచ్ఛాలను అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం మం త్రి కేటీఆర్‌ పాలకవర్గ సభ్యులకు భుభాకాంక్షలు తెలిపారు. మం త్రిని కలిసిన కౌన్సిలర్లలో గంగామోహన్‌ చక్రు, మేడిదాల సం గీత రవిగౌడ్‌, ఇట్టెడి నర్సారెడ్డి, లిక్కి శంకర్‌, తాటి హన్మాండ్లు, ఆకుల రాము, ఏనుగంటి వరలక్ష్మీ లింబాద్రిగౌడ్‌, అల్జాపూర్‌ రేవతి, బండారి శాలప్రసాద్‌, బారడ్‌ రమేశ్‌కుమార్‌, జనార్దన్‌ రాజు, సుంకరి సుజాత, బాదం రాజ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. 


logo