శనివారం 30 మే 2020
Nizamabad - Jan 28, 2020 , 02:16:16

అతివలకే అందలం

అతివలకే అందలం
  • నిజామాబాద్‌ కార్పొరేషన్‌తో పాటు ఆర్మూర్‌, బోధన్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల్లో పదవులు చేపట్టిన మహిళామణులు

ఆర్మూర్‌, నమస్తే తెలంగాణ: కొత్త మున్సిపల్‌ చట్టంతో 50 శాతం మహిళా రిజర్వేషన్లలో భాగంగా జిల్లాలోని నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, ఆర్మూర్‌, బోధన్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల్లో చైర్మన్‌ స్థానాలు బీసీ మహిళలకు రిజర్వు అయ్యాయి. దీంతో నిజామాబాద్‌ మేయర్‌ స్థానం తో పాటు ఆర్మూర్‌, బోధన్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్‌ పదవులను దక్కించుకునేందుకు ప్రధాన నాయకగణమంతా పోటీలో నిలిచి వారి సతీమణులు, బంధువులను బరిలోకి దింపారు. సోమవారం కార్పొరేషన్‌లో మేయర్‌, డిప్యూటీ మేయర్‌, ఆర్మూర్‌, బోధన్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఎన్నిక నిర్వహించారు. ఆర్మూర్‌, భీమ్‌గల్‌లలో చైర్‌పర్సన్‌లను ఏకగ్రీవం కాగా.. నిజామాబాద్‌ మేయర్‌, బోధన్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. నిజామాబాద్‌ మేయర్‌గా నీతూ కిరణ్‌, ఆర్మూర్‌ మున్సిపల్‌ చై ర్‌పర్సన్‌గా పండిత్‌ వినీత, బోధన్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గా తూము పద్మావతి, భీంగల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా మల్లెల రాజశ్రీకి పదవులు దక్కాయి. జిల్లాలోని నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌తో పాటు ఆర్మూర్‌, బోధన్‌, భీమ్‌గల్‌ బల్దియాల్లో చైర్‌పర్సన్‌ స్థానాల్లో అతివ లే అందలమెక్కారు. జిల్లాలోని అన్ని స్థానాలు గులాబీ వ శం అయ్యేలా ప్రణాళికలను క్షేత్రస్థాయిలో అమలుపరు స్తూ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పెద్దన్న పాత్ర పో షించారు. భీంగల్‌ మున్సిపాలిటీలోని 12 కౌన్సిలర్‌ స్థానాలకు గాను 12 స్థానాలు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులనే రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గెలిపించుకున్నారు. ఆర్మూ ర్‌, బోధన్‌ మున్సిపాలిటీల్లో ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బోధన్‌ ఎమ్మెల్యే మహమ్మద్‌ షకీల్‌ల పర్యవేక్షణలో మెజార్టీ స్థానాలకు పైగా కౌన్సిలర్లను గెలిపించుకొని మున్సిపాలిటీల్లో గులాబీ జెండాలను ఎగురవేయించారు. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీకి కార్పొరేటర్‌ల స్థానాలు తగ్గినా.. నిజామాబాద్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా పర్యవేక్షణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఎక్స్‌అఫిషీయో సభ్యుల మద్దతుతో మేయర్‌ స్థానం టీఆర్‌ఎస్‌ వశమైంది. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవిని ఆశించి పలువురు మహిళామణులు ఓటమితో భంగపడ్డారు. దీంతో కార్పోరేషన్‌లోని 11వ డివిజన్‌ కార్పొరేటర్‌గా గెలుపొందిన దండు నీతు మేయర్‌ ప దవి వరించింది. టీఆర్‌ఎస్‌, ఎంఐఏం, ఇండిపెండెంట్‌ కా ర్పొరేటర్ల, ఎక్స్‌అఫిషీయో మెంబర్ల మద్దతుతో దండు నీ తు మేయర్‌గా పీఠం అధిరోహించారు. ఆర్మూర్‌, నిజామాబాద్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్‌ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌శ, ఎమ్మెల్సీ లు ఆకుల లలిత, రాజేశ్వర్‌, వీజీగౌడ్‌ మేయర్‌ పదవి ద క్కించుకునేందుకు ఎన్నికలో పాల్గొని దండు నీతుకు మద్దతుగా చేతులెత్తారు. బోధన్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా తూ ము పద్మావతి బోధన్‌ మున్సిపల్‌ కార్యాలయంలో జరిగి న ఎన్నికలో విజయం సాధించారు. ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని దక్కించుకునేందుకు ఏడుగురు ఆశావహులు పోటీపడగా.. మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్‌ పండిత్‌ ప్రేమ్‌ వదిన 33వ వార్డు కౌన్సిలర్‌ పండిత్‌ వినీత ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భీమ్‌గల్‌ మున్సిపాలిటీలోని 12 సీట్లకు 12 సీట్లు టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకోగా.. చైర్‌పర్సన్‌ పదవి కోసం మల్లెల రాజశ్రీ, కన్నె సురేందర్‌ సతీమణీలు పోటీపడగా.. చెరి స గం పదవి కాలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర మంత్రి వేముల ప్ర శాంత్‌రెడ్డి ఒప్పందం కుదిర్చారు. తొలి రెండున్నరేళ్లు మల్లె ల రాజశ్రీకి చైర్‌పర్సనగా, తర్వాతి పదవీ కాలన్ని కన్నె సు రేందర్‌ సతీమణి కేటాయించేలా ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. దీంతో భీమ్‌గల్‌ మున్సిపాలిటీ తొలి చైర్‌పర్సన్‌గా మల్లెల రాజశ్రీ పదవి వరించింది. జిల్లాలో నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు ఆర్మూర్‌, బోధన్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల్లో అతివలే అందలమెక్కి మేయ ర్‌, చైర్‌పర్సన్‌ స్థానాల్లో కొలువుదీరారు. మహిళలు రాజకీయాల్లో మరింతగా రాణించడాని స్ఫూర్తిగా నిలిచారు.


logo